ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పటికీ అందేను... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పటికీ అందేను...

ఖమ్మం, జూలై 3, (way2newstv.com)
పంట రుణాల్లేవు.... ఇన్‌పుట్‌ సబ్సీడీ ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బాటంగా ప్రవేశపెట్టిన ఇన్‌పుట్‌ సబ్సీడి అదివాసీలకు అందని ద్రాక్షగా మారింది. ఇన్‌పుట్‌ సబ్సీడి లక్షామేంటి? గిరిజన నేతరులకేనా ప్రోత్సహకమా? అట్టడుగున అదివాసీలు రైతులుకు కాదా? పోడు భూములకు ఇన్‌పుట్‌ ఇవ్వడానికి ఆటంకాలున్నాయో? అదివాసీలపై ఎందుకీ నిర్లక్ష్యం? వైనంపై  ప్రత్యేక కధనం.ఖమ్మం,భద్రాద్రి జిల్లాలో అదివాసీల జనాభ ఎక్కువ. భద్రచలం, మణుగూరు,పాల్వంచ తదితర మండాలాల్లో 60శాతం గిరజనులే. ఖమ్మం జిల్లాలో కామేపల్లి,కారేపల్లి,కూసుమంచి, తిరుమలాయపాలెం, మండలాల్లో బంజార గిరిజనులే అధిక శాతం. బంజార తెగకు చెందిన వారు సైతం పోడుభూముల్లో వ్యవసాయం చేస్తూంటారు. అడవి చెంతనుండే అదివాసీలుది అదే పరిస్థితి. అడవిని నరికి సాగు చేస్తూంటారు. ప్రధానంగా వరి,పత్తి పండిస్తూంటారు. ఈ భూములన్ని వర్షాధారితమే. అది వాసీలు పోడు భూములు కావటంతో వాటికి పట్టాల్లేవు. 
 
 
 
ఇన్ పుట్ సబ్సిడీ ఎప్పటికీ అందేను...
 
దీంతో వారికి బ్యాంకులు రుణసహాయాన్ని అందించవు. ఫలితంగా రుణమాఫీ ఊసే వారికి తెలియదు. సాంప్రదాయ పద్దతుల్లో వారు పంటలు పండిస్తూంటారు. దీంతో దిగుబడి శాతం తక్కువ. వారికి ఆర్ధికస్వాలంభన కలగానే మిగిలిపోయింది. పేద రైతులు,రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు ప్రభుత్వం రానున్నా ఏడాది నుండి ఇన్‌పుట్‌ సబ్సీడి పధకాన్ని ప్రవేశపెట్టింది. నిరక్షరాస్యులు, నాగరికతకు దూరంగా నున్నా అదివాసీలకు ఇన్‌పుట్‌ పధకం గురించే తెలియదు. సమగ్ర గిరిజనాభివృద్ది సంస్థ అందించే ప్రోత్సహాకాలు మాత్రమే గిరిజనలకు అందుతున్నాయి. అవికూడా అంతంత మాత్రమే కేవలం వర్షాధారిత పోడు వ్యవసాయం మాత్రమే వారికి జీవనధారం మిగిలిన కాలమంతా కూలీ పని చేసి జీవనాన్ని సాగిస్తుంటారు. ఆమాయక గిరిజనలు నేటికి ఆర్ధిక స్వాలంభన సాదించలేకపోతున్నారు.పోడు భూములు పట్టా భూములు కాదు. అభూములన్ని అటవి సంపదలో భాగమే. కానీ ఆభూములకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ హక్కులు కల్పించింది. ఈ భూములకు ఇన్‌పుట్‌ సబ్సీడి ఇవ్వడానికి చట్టపరమైనా ఆటంకాల్లేవు. రాష్ట్రప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ఈ పధకాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి చిన్న,సన్నకారు రైతులకు ఆర్ధిక ఊరట కల్పించాలన్నదే పధకం లక్ష్యం. అటువంటిపుడు ఆదివాసీ పోడు భూములకు ఇన్‌పుట్ సబ్సీడి ఎందుకు వర్తింప చేయలేదని అదివాసీ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పేదరికంలో మగ్గుతున్న అదివాసీల పట్ల ప్రభుత్వ పక్షపాత దోరణి విడనాడాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్టడుగునున్నా గిరిజనులను ప్రోత్సహించే దిశగా ఇన్‌పుట్‌ సబ్సీడిని అందించి ఆదుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు. ప్రభుత్వం పధకం ఫలాలు పేదలకు అందినప్పుడే ఆశయం నేరవేరుతుంది. ఈ ఆశాయం దిశగా ప్రభుత్వం ఇన్‌ పుట్‌ సబ్సీడిని పోడు రైతులవర్తింపజేయాలని అదివాసీలు కోరుతున్నారు.