న్యూఢిల్లీ, జూలై2 (way2newstv.com)
లోక్‌సభ సభ్యులు సభలో సంధించే ప్రశ్నల పరిమితిని కుదించారు. గతంలో ఓ ఎంపీ రోజుకు 10 ప్రశ్నలు అడిగే అవకాశం ఉండగా, ప్రస్తుతం దానిని 5 కు కుదించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం వెలువరించారు. జులై 18 నుంచి జరిగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలతోనే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని లోక్‌సభ 'క్వశ్చన్స్ సెల్' ఓ బులెటిన్‌లో తెలిపింది. స్పీకర్ ఆదేశాల మేరకు, ఇకపై ఏ సభ్యుడు కూడా రోజుకు 5 ప్రశ్నలకు మించి సంధించడానికి వీల్లేదు. సమావేశాలు సందర్భంగా సభ్యులు అడిగే ప్రశ్నలు సంఖ్య రోజుకు సగటున 230 దాటుతోందని, వాటికి మొత్తం సమాధానాలు ఇవ్వడం కష్టసాధ్యమవుతోందని భావించిన నేపథ్యంలోనే స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు లోక్‌సభ వర్గాలు వెల్లడించాయి.లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలతా శ్రీవాత్సవ్ సంతకంతో ఈ ప్రకటన వెలువడింది. ఒకవేళ సభ్యుడు ఐదు కంటే ఎక్కువ ప్రశ్నలు అడగడానికి నోటీసులు ఇస్తే మిగతా వాటిని మర్నాడు అనుమతిస్తారని అందులో పేర్కొన్నారు. సమావేశాలు ముగిసే వరకూ అడగదలుచుకున్న ప్రశ్నల గురించి నోటీసులు ఇవ్వాలనుకుంటే క్వశ్చన్ సెల్‌కు ముందుగా వాటిని సమర్పించాలని కోరింది. 16 వ లోక్‌సభ 15 విడత సమావేశాల నుంచే తాజా నిబంధనలు అమల్లోకి రానున్నట్టు తెలియజేశారు.
ఎంపీలకు ఇక ఐదు ప్రశ్నలే..