టీడీపీ.బీజేపీలది ఫెవికాల్ బంధం : వైఎస్ జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీడీపీ.బీజేపీలది ఫెవికాల్ బంధం : వైఎస్ జగన్

కాకినాడ, జూలై 21, (way2newstv.com) 
నాలుగేళ్లుగా మేము మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ చెప్పారు. నాలుగేళ్లుగా మేము చెబుతుంటే మమ్మల్ని వెక్కిరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు.  కాకినాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిన్నటి అవిశ్వాస తీర్మానంపై స్పందించారు. 25 మంది ఎంపీలు నిరాహారదీక్ష చేస్తే జాతీయ పార్టీలు దిగి వస్తాయని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలందరూ రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడు అవిశ్వాసం వీగిపోయిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. అరుణ్  జైట్లీ ప్రసంగాన్ని పదేపదే పొగిడారు.  అన్యాయంగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొట్టిందని, కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఏపీకి అన్యాయం చేశాయన్నారు. ఎన్నికల సమయంలో హోదా పదిహేనేళ్లు కావాలన్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాకు తూట్లు పొడిచారన్నారని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ హోదాపై డ్రామాలాడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు అందరూ ప్రజలను మోసం చేశారన్నారు. వీళ్లను ఎవరూ నమ్మవద్దన్నారు. మోడీ నుంచి మొదలు పెడితే…కాంగ్రెస్ సహా మిగిలిన అన్ని పార్టీల వైఖరీ కూడా అలాగే ఉందన్నారు. ఏపీకి సంబంధించి విషయాలు ఒక్కరి నోటి వెంట కూడా రాలేదని జగన్ అన్నారు. ఆంధ్రరాష్ట్రం నష్టపోయిందని, కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు, వారిలో చంద్రబాబు కూడా ఉన్నారని జగన్ అన్నారు. ఈ నాలుగేళ్లలో ఏపీ విషయాలను పట్టించుకోలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన మోడీ నోటి వెంటన ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట రాలేదని జగన్ చెప్పారు. తిరుపతి సభలో మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు రాలేదు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో ఏపీకి ఇచ్చిన హామీలు ప్రధానికి గుర్తుకురాలేదని జగన్ అన్నారు.
 
 
 
టీడీపీ.బీజేపీలది ఫెవికాల్ బంధం : వైఎస్ జగన్ 
 
బీజేపీతో యుద్ధం అంటారు. బీజేపీ మంత్రి భార్యకు టిటిడి బోర్డు మెంబర్ గా నియమించారు. బీజేపీతో యుద్ధం అంటూ బాబుతో బంధం తెగిపోదని రాజ్ నాథ్ సింగ్ అంటారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రోగ్రాం లో వెంకయ్యనాయుడు కూర్చుంటారని అన్నారు.  రాహుల్ గాంధీ ప్రసంగంలో అర నిమిషం పైసా ఏపీ ప్రస్తావన లేదు. రాజ్ నాధ్ సింగ్ బీజేపీ, టీడీపీ బంధం పై స్పష్టత ఇచ్చేశారు.. వారిది ఫెవికల్ బంధం అని తేలిపోయింది.  బీజేపీ, టీడీపీ సంబంధాల కారణంగానే వైసిపి అవిశ్వాస తీర్మానం అడ్డుకున్నారు. తొలి స్పీకర్ గా టీడీపీ కే అవకాశం ఇవ్వడం, పరిమితికి మించి సమయం ఇవ్వడం వారి బంధానికి నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.