హైదరాబాద్ జనవరి 31 (way2newstv.com)
మంత్రి కేటిఆర్ ను వేములవాడ మునిసిపల్ చైర్మన్ రామతీర్ధపు మాధవి, వైస్ చైర్మన్ మధు రాజేందర్ శర్మ, సెస్స్ డైరెక్టర్ రామతీర్ధపు రాజు శుకరవారం మర్యాదపూర్వకంగా కలిసారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ, దేవాలయాభివృద్దికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
నీతి వంతమైన పాలనను అందిద్దాం!
ప్రస్తుతం సమ్మక్క సారాలమ్మ సందర్భంగా వస్తున్న లక్షలాదిమంది భక్తులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన మెరుగైన సేవలు అందించాలని కమీషనరును ఆదేశించారు. శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 20, 21 తేదీలలో కోటి రూపాయలతో అద్భుతమైన శివార్చన నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వేములవాడ మున్సిపాలిటీలో సుపరిపాలనకు నడుముకట్టాలని చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రత్యేక సూచనలు చేశారు. వీటీడీఏతో కలిసి అభివృద్ధిలో పాలు పంచుకోవాలని తాను, ఎమ్మెల్యే చెన్నమనేనితో కలిసి స్వయంగా త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.