ఒక్కసారి స్పీడ్ పెంచిన సమంతా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఒక్కసారి స్పీడ్ పెంచిన సమంతా

హైద్రాబాద్, జూలై 28 (way2newstv.com) 
క్యూట్ బ్యూటీ సమంత.. అమాంతం జోరు పెంచేసింది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సూపర్ బిజీగా ఉన్న సామ్... మరోవైపు కోలీవుడ్ లోనూ షైన్ అవుతోంది. ఇంత బిజీలోనూ అమ్మడు మరో కొత్త ఆర్ట్ కు పదును పెడుతోందట. ఆ ముచ్చటేంటో ఇప్పుడు చూద్దాం. పెళ్లయ్యాక కాస్త జోరు తగ్గించినట్లే కనిపించిన సమంత... ఒక్కసారి స్పీడ్ పెంచేసింది. ఈ ఏడాది.. వరుస సినిమాలతో సందడి చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి సినిమాలతో అలరించిన సామ్... స్టార్ హీరోలకు మించిన సక్సెస్ రేట్ దక్కించుకుని ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకుపోతోంది.ఓ వైపు అక్కినేని వారి కోడలిగా తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు.. సినిమాలతో సూపర్ బిజీగా ఉంటోంది సామ్. ఇంకోవైపు మాతృభాష అయిన తమిళం నుంచి ఆఫర్లు వస్తున్నా కాదనకుండా చేసేస్తోంది. తాజాగా కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న సినిమా "సీమరాజా"లోనూ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. ఇక ఈ మధ్య వైవిధ్యమైన పాత్రలకు పెద్ద పీట వేస్తున్న సామ్... ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ క్వీన్ గా కనిపించబోతోందట. "సీమరాజా"లో సామ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా కనిపించనున్న సామ్... కొన్ని సన్నివేశాల్లో అదిరిపోయే ఫైటింగ్ లు కూడా చేయబోతోందట. తన పాత్ర కోసం అమ్మడు రెండు వారాల పాటూ శిలంబం అనే యుద్ధవిద్యలో శిక్షణ కూడా పొందిందట. ఎంత బిజీగా ఉన్నా... వర్క్ కమిట్మెంట్ విషయంలో సామ్ తరువాతే ఎవరైనా అనడంలో అతిశయోక్తిలేదు. మరి.. అమ్మడి కష్టం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
 
 
 
ఒక్కసారి స్పీడ్ పెంచిన సమంతా