బీజేపీదే యూటర్న్ ఎంపీలతో సీఎం చంద్రబాబు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీదే యూటర్న్ ఎంపీలతో సీఎం చంద్రబాబు

అమరావతి, జూలై 28, (way2newstv.com)
పార్లమెంటులో వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టిడిపి ఎంపిలకు చెప్పారు.  శుక్రవారం నాడు టిడిపి ఎంపిలతో చంద్రబాబునాయుడు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఎపికి జరిగిన అన్యాయాన్ని అత్యున్నత చట్ట సభల్లో ఎండగట్టారని, ఎంపిల పోరాటంపై ప్రజల్లో ప్రశంసలు వచ్చాయని అన్నారు. ఎంపిలు తమ బాధ్యతను పకడ్బందీగా నిర్వర్తించారని, పార్లమెంటులో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, కేంద్రం ఒంటెద్దు పోకడలపై ధ్వజమెత్తారని ఆయన అన్నారు. బిజెపి అవకాశవాద రాజకీయాలను ఎండగట్టారని, ఇదే పోరాటాన్ని ఇకముందు కూడా కొనసాగించాలని ఆయన అన్నారు. జీరో అవర్, ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చల్లో మనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. మన సంపద కావాలి, మన వనరులు కావాలి. 

బీజేపీదే యూటర్న్ 
ఎంపీలతో సీఎం చంద్రబాబు
కానీ మనకిచ్చిన హామీలు నెరవేర్చరు. ఏపి పునర్విభజన చట్టాన్ని అమలు చేయరని అన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. 5కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలి. వరుసగా 3రోజులు సెలవులు వచ్చాయి . కాబట్టి ప్రజాక్షేత్రంలో కేంద్రం చర్యలను ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు. ఒంగోలు ధర్మపోరాట సభకు ఎంపిలు హాజరుకావాలి. వారు చేసిన పోరాటానికి ప్రజా స్పందన గమనించాలి. భవిష్యత్ పోరాటానికి మరింత ఉత్తేజితులు కావాలి. బిజెపిదే యూటర్న్ తప్ప టిడిపిది కాదు. టిడిపిది ఎప్పుడూ రైట్ టర్న్ అనేది చెప్పాలి. ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకోవడం యూటర్న్ కాదా?  మేనిఫెస్టోలో చెప్పింది చేయక పోవడం యూ టర్న్ కాదా?  10ఏళ్లు హోదా ఇస్తామని ఇప్పుడు ఇవ్వం అనడం  యూ టర్న్ కాదా అని అయన ప్రశ్నించారు. రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్ కు విజిఎఫ్ సగం తగ్గించారు.  కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కు రూ.5,615కోట్లు మనల్నే కట్టమనడం యూ టర్న్ కాదా?  ఢిల్లీముంబై కారిడార్ కో న్యాయం? విశాఖ-చెన్నై కారిడార్ కో న్యాయం? ఇది బిజెపి యూ టర్న్ కాదా? థొలెరా నగరానికి పుష్కలంగా నిధులిచ్చి అమరావతికి అన్యాయం చేయడం యూ టర్న్ కాదా? టిడిపిని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తారా? మూడు పార్టీలు కలిసి లాలూచీ చేస్తారా..? టిడిపి పోరాటం పెంచినప్పుడల్లా లాలూచిపరులతో పోటి కార్యక్రమాలు పెట్టిస్తారా?  ఒంగోలు ధర్మపోరాట సభ రోజే మరోచోట పోటి దీక్షలు  చేయిస్తారా..? బిజెపి, వైసిపి, జనసేన మూడు పార్టీల లాలూచి బైటపడిందని అన్నారు.