ఆగష్టు 15 నసీఎం శ్రీకాకుళం పర్యటన ఏర్పాట్లపై మంత్రి అచ్చేన్నాయుడు సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆగష్టు 15 నసీఎం శ్రీకాకుళం పర్యటన ఏర్పాట్లపై మంత్రి అచ్చేన్నాయుడు సమీక్ష

శ్రీకాకుళం, ఆగష్టు 11(way2newstv.com)
ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలుకు సిఎం చంద్రబాబునాయుడు శ్రీకాకుళం రానున్నారు.  ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్, ఎస్పీ, ముఖ్య అధికారులు తో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసారు. సీఎం పర్యటన ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులు కు ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గర్భిణులుకు, బాలింతలకు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించాలని బాలసంజీవని పధకాన్ని మంత్రి ప్రారంభించారు. మహిళా అభ్యుదయంలో సాధికారమిత్ర పాత్ర వాల్ ఫోస్టర్ ను ఆవిష్కరించారు. జిల్లా లో జ్వరాలు తో గ్రామస్థులుఇబ్బందులు పడుతున్నారని,అటువంటి గ్రామాలు గుర్తించి వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసనమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ, డిపిఓ కు ఆదేశించిన మంత్రి ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్లో పెట్టిన వారికి లోన్స్ అందించేందుకు, కులవృత్తి దారులకు గ్రూపు లోన్లు అందించేందుకు త్వరగతిన చేయాలని,ఆదరణ2 పధకం కింద లభ్ధిదారులకు ఎంపికలు పూర్తి చేయాలని ఆదేశించారు.
 
 
 
ఆగష్టు 15 నసీఎం శ్రీకాకుళం పర్యటన
ఏర్పాట్లపై మంత్రి అచ్చేన్నాయుడు సమీక్ష
 
వంశదార అధికారులు తో మాట్లాడుతూ టైలాండ్ కు నీరు అందించాలని, సీజనల్ లస్కర్లను వెంటనే భర్తీ చేసి కాల్వల లీకేజీ గుర్తించి సాగునీరు  సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.