ఛత్తీస్ ఘడ్ సీఎం కోసం కాంగ్రెస్ స్వయం వరం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఛత్తీస్ ఘడ్ సీఎం కోసం కాంగ్రెస్ స్వయం వరం

రాయ్ పూర్, ఆగస్టు 13  (way2newstv.com)
సీఎం ఏంటి.. స్వయంవరం ఏంటని షాకవుతున్నారా. ఛత్తీస్‌గఢ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కాంగ్రెస్ కొత్త కొత్త సీఎంను స్వయంవరంలో ఎంపిక చేస్తుందట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు ఆ పార్టీ సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో. మీడియాతో మాట్లాడిన డియో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. 15ఏళ్లగా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.
 
 
 
ఛత్తీస్ ఘడ్ సీఎం కోసం కాంగ్రెస్ స్వయం వరం
 
 రామాయణంలో శ్రీరాముడు 14ఏళ్లు వనవాసం తర్వాత పాలన చేపట్టినట్లే .. తాము కూడా ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వస్తామంటున్నారు. అంతేకాదు తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమనే సంకేతాలను పంపించారు. ఇదే సమయంలో సీఎం ఎంపిక వ్యవహారం గురించి ప్రస్తావన రాగా.. డియో స్పందించారు. ఎంపిక విధానాన్ని రామాయణంతో ముడిపెట్టిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సమర్థవంతులైన నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచాక సీఎం ఎంపిక కోసం స్వయంవరం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత సీఎం ఎంపిక చేయడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదన్నారు డియో. 2003 ఎన్నికల్లో కూడా బీజేపీ రమణ్ సింగ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి కూడా అంతేనన్నారు. మరో ఉదాహరణను ప్రస్తావించారు డియో. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించిందని.. కాని ఆ అభ్యర్థి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం మీద స్వయంవరం పేరుతో ఈ పెద్దాయన కొత్త చర్చను తెరపైకి తెచ్చారు.