ప్రధానితొ తెలంగాణ ఎంపీల భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రధానితొ తెలంగాణ ఎంపీల భేటీ

న్యూఢిల్లీ, ఆగష్టు 11 (way2newstv.com)
ప్రధాని నరేంద్ర మోడీతో టిఆర్ఎస్ ఎంపిలు శుక్రవారం సమావేశమయ్యారు. తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన బైసన పోలో భూములను తమకు ఇవ్వాలని వారు ప్రధానిని కోరారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పలు సందర్భాల్లో విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని వారన్నారు. భూమికి బదులు భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీల బృందం చెప్పింది. బైసన్, జింకానా స్థలాన్ని ఇవ్వాలని అనేక మార్లు కోరామని వారన్నారు. ఇదే అంశంపై సిఎం కేసీఆర్ ప్రధానితో అనేక మార్లు చర్చించారు. దే అంశంపై సిఎం కేసీఆర్ ప్రధానితో అనేక మార్లు చర్చించారు. అప్పటి రక్షణ శాఖ మంత్రులు స్థల బదలాయింపు పై క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. 
 
 
 
 ప్రధానితొ తెలంగాణ ఎంపీల భేటీ
 
బైసన్ పోల్ ల్యాండ్ కు బదులు స్థలం, 95 కోట్లు ఇవ్వాలని కేంద్ర రక్ష శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు ప్రతి ఏటా 35 కోట్లు ఇవ్వాలని కొరింది. ఈ 35 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని  కోరింది, హైలెవల్ కమిటీ భూమిని బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ సూచన తో జవహార్ నగర్ లో దాదాపు 560 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన లు పంపింది. రేపో, రెండు రోజుల్లో స్థల బదలాయింపు అవుతుందన్న క్షణాన రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మారారు. నాటి నుంచి ఈ ఫైల్ ముందుకు సాగడం లేదు. కర్ణాటక ప్రభుత్వం అడగగానే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, తెలంగాణ కు మాత్రం భూమిని బదలాయించకుండ కేంద్ర రక్షణ శాఖ ఆలస్యం చేస్తోంది. ఇప్పుడు మరోకొత్త మెలికతో స్థలాల ఇవ్వకుండ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆలోచన చేస్తున్నారు. బైసన్ పోలో స్థలం, కంటోన్మెంట్ ఏరియా స్థలానికి సంబంధించి వేరు వేరుగా లేఖలు ఇవ్వాలనడం సరికాదని వారన్నారు. ఇదంతా స్థలం ఇవ్వకుండ ఆలస్యం చేయాడానికే అని మేము భావిస్తున్నాం రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి చ్చే అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల వ్యవస్థకు ప్రధాని సానుకూలంగా స్పందించారని వారన్నారు.