ముగిసిన సీఎం పర్యటన

విశాఖపట్నం, ఆగష్టు 11 (way2newstv.com):
విశాఖ పర్యటన ముగించుకున్న చంద్రబాబు తిరుగుపయణమయ్యారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా పాడేరు మండలం అడారిమెట్టలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం గిరిజనులకు వరాలు ప్రకటించారు. అవినీతి లేని సులభతరమైన పాలన అందిస్తున్నామని అన్నారు. ఆదివాసీల ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామని, ఆదివాసీల జీవన ప్రమాణాలు పెంచేలా కృషిచేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అవకాశాలు వస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఆదివాసీ యువతకు ఉందని, గిరిజన విద్యార్థుల విదేశీ విద్యకు రూ. 15 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సీఎం తెలిపారు.ఈ సందర్బంగా చంద్రబాబు గిరిజనులతో దింస్సా నృత్యాలు ఆడి ఆకట్టుకున్నారు.
 
 
 
ముగిసిన సీఎం పర్యటన
 
Previous Post Next Post