కరుణ పార్థివదేహానికి చంద్రబాబు నాయుడు ఘన నివాళి ఆయన గొప్ప మానవతావాది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కరుణ పార్థివదేహానికి చంద్రబాబు నాయుడు ఘన నివాళి ఆయన గొప్ప మానవతావాది

చెన్నై ఆగష్టు 9  (way2newstv.com) 
చెన్నైలో కరుణ పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరుణానిధిని గొప్ప మానవతావాది, నాయకుడు అని అలాంటి వ్యక్తిని మనం కోల్పోయామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అతిగొప్ప నాయకుడు కరుణానిధి అని అన్నారు. ఎనిమిది దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉన్న గొప్పనేత కరుణానిధి అని, తమిళనాడు ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని అన్నారు. తమిళనాడు అభివృద్ధి గురించే కాకుండా, దేశం అభివృద్ధి చెందాలని కరుణ కలలు కనేవారని చెప్పారు. కరుణానిధి చేసిన సేవలను తమిళనాడు మాత్రమే కాక యావత్ దేశమంతా గుర్తుంచుకుంటుందని చెప్పారు. కరుణ మరణంతో దక్షిణ భారతదేశం ఒక మహా నేతను కోల్పోయిందని... ఆ లోటును మరెవరూ భర్తీ చేయలేరని అన్నారు కరుణానిధితో, డీఎంకే పార్టీతో టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు స్పందించారు.కరుణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలకు సంబంధించిన వివాదంపై మీడియా ప్రశ్నించగా... అలాంటి విషయాలపై ఇప్పుడు మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. కరుణ ఒక గొప్ప నేత అని, ఆయన అందించిన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు కూడా అందించాలని చెప్పారు. కరుణ పార్థివదేహానికి చంద్రబాబు నాయుడు ఘన నివాళి
               ఆయన గొప్ప మానవతావాది