ఆయనో పెద్ద వ్యభిచారి... పాక్ ప్రధాని మాజీ భార్య బీబీసీ రెహమ్ ఖాన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆయనో పెద్ద వ్యభిచారి... పాక్ ప్రధాని మాజీ భార్య బీబీసీ రెహమ్ ఖాన్

న్యూ ఢిల్లీ ఆగష్టు 27 (way2newstv.com) 
పాక్ ప్రధానమంత్రి..మాజీక్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పెద్ద వ్యభిచారి అంటూ తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఆయన్ను అంతేసి మాటలు అన్నది ఏ రాజకీయ నాయకుడో అయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ.. ఆ మాటలు అన్నది ఆయనతో కొన్నాళ్లు వైవాహిక బంధాన్ని నడిపి.. ఆ మధ్యన విడిపోయిన మాజీ భార్య కమ్ బీబీసీ జర్నలిస్టు రెహమ్ ఖాన్.ఇమ్రాన్ ను పెళ్లాడి.. ఆయనతో పొసగక విడాకులు తీసుకున్న ఆమె.. ఈ మధ్యనే తన ఆత్మ కథను రాశారు. అందులో ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇమ్రాన్ ద్విలింగ సంపర్కుడని.. ఆయనొక వ్యభిచారి అని.. డ్రగ్స్ కు బానిసంటూ ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
 
 
 
ఆయనో పెద్ద వ్యభిచారి...
పాక్ ప్రధాని మాజీ భార్య బీబీసీ రెహమ్ ఖాన్
 
ఇటీవల ఆమె విడుదల చేసిన ఆత్మకథలో ఇందుకు సంబంధించిన పలు వివాదాస్పద వ్యాఖ్యల్ని.. ఆరోపణల్ని చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. హంగు.. ఆర్భాటాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పొదుపుగా.. నిరాడంబరంగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యేలా ఆయన మాజీ భార్య వ్యాఖ్యలు చేస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది. కొన్నిసార్లు.. కొంతమంది తలరాత ఇలానే ఉంటుంది మరి. దేశ ప్రధాని అయ్యే అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకున్నా.. తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు.. ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే దరిద్రం కొందరికి మాత్రమే సొంతం. మరి.. ఈ వ్యాఖ్యలపై ప్రధాని హోదాలో ఉన్న ఇమ్రాన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.