కరీంనగర్ లో వీహెచ్ పీ అందోళన

కరీంనగర్, ఆగస్టు 13, (way2newstv.com)
తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ పరిపూర్ణానంద స్వామిజి నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అందోళనకు దిగింది. దీంతో  కరీంనగర్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిపూర్ణానంద స్వామిజీ నగర బహిష్కరణ నిరసిస్తూ హిందుత్వ సంఘాలు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న  బజరంగ్ దళ్ కార్యకర్తలు ,బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసారు. అంతకుముందు పోలీసులు, అందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
 
 
 
కరీంనగర్ లో వీహెచ్ పీ అందోళన
Previous Post Next Post