అభ్యర్దుకార్యకర్తల అభిష్టం మేరకేలు

వరంగల్సె,ప్టెంబర్27(way2newstv.com) 
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని అధికారులు సహాకరించాలి.  టీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలి.  ఈవీఎంలను కేసీఆర్, మోడీ కలిసి టాంపరింగ్ చేసే అవకాశం ఉంది.  కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరు ఈవీఎంలను చెకింగ్ చేయాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన హసన్పర్తి మండలం భీమారంలో తెలంగాణ మేధావుల ఫోరమ్ నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు అనే అంశంపై జరిగిన సమావేశంలో మాట్లాడారు.  


అభ్యర్దుకార్యకర్తల అభిష్టం మేరకేలు

తెలంగాణ ప్రజల హక్కులు కాలరాసే విదంగా కేసీఆర్, మోడీ వ్యవహరిస్తున్నారు.  సంగారెడ్డి నుండి జగ్గారెడ్డి, వరంగల్ నుండి గండ్ర వెంకటరమణ రెడ్డి, రేవంత్ రెడ్డి పైన కేసులు పెడుతున్నారు.  అధికారంలోకి వచ్చేది మేమే... వడ్డీతో సహా కేసీఆర్ ఋణం తీర్చుకుంటామని అన్నారు.  అభ్యర్థులు ఎవరైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నూటికి నూరు శాతం గెలుస్తాం. కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అన్నారు.  ఈ సదస్సులో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, పొన్నాల, కొండా సురేఖ, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post