అమరావతి, సెప్టెంబరు 28(way2newstv.com)

రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న వాటర్ వేస్ ట్రాఫిక్ మరియు ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ విస్తరణ క్రమబద్దీకరణపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.ఈమేరకు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జెసి శర్మ,రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కె.దుర్గా ప్రసాద్,రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ వైఎస్.సుధాకర్ లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు ఈనివేదికను అందించింది.

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న జలరవాణా రంగంలో(పాసింజర్ మరియు గూడ్స్ రవాణాతోపాటు టూరిజం అండ్ వాటర్ స్పోర్ట్సు)అభివృద్ధి మరియు విస్తరణకు వాటి పర్యవేక్షణ,నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తూ ప్రభుత్వం గత నవంబరు 20వతేదీన జారీ చేసిన జిఓ ఆర్.టి.నంబరు 670 ఉత్తర్వులు ద్వారా ఈకమిటీని నియమించింది.ముఖ్యంగా బోటు ఆపరేషన్స్ (నిర్వహణ) రెగ్యులేషన్ అండ్ మానిటరింగ్ మరియు ప్రయాణీకుల భద్ర,బోట్ల రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ మరియు రెగ్యులేటరీ క్రమబద్ధీకరణను దృష్టిలో ఉంచుకుని ఈకమిటీని నియమించడం జరిగింది.ఈకమిటీ జాతీయ అంతర్జాతీయంగా జలరవాణాకు సంబంధించి అమలవుతున్న ఉత్తమ విధానాలను పరిశీలించి తన నివేదికను అందించడం జరిగింది. ముఖ్యంగా జలరవాణా నిర్వహణ,నియంత్రణ తదితర అంశాలకు సంబంధించి ఈకమిటీ విజయవాడ,ధవళేశ్వరంలలో ఇందుకు సంబంధించి రేవుల శాఖ,జలవనరుల శాఖ,ఎపి టూరిజం,ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా,రెవెన్యూ,పోలీస్ తదితర శాఖలు, వివిధ వర్గాలవారితో పలు సమావేశాలను నిర్వహించింది.అంతేగాక బోటు యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడడంతోపాటు రాజమండ్రి లోని పుష్కర ఘాట్,ఇతర ఘాట్లను, విజయవాడలోని పుణ్ణమి ఘాట్,పవిత్రసంఘం ఘాట్ ను,పులిచింతల,ముక్త్యాల,జగ్గయ్య పేటల్లో జరుగుతున్న పనులను,పర్యాటక బోట్లు మరియు వెస్సల్స్ ను పరిశీలించడంతోపాటు పవిత్ర సంఘం,పోలవరంలలో జరిగిన బోటు ప్రమాద ప్రాంతాలను ఈకమిటీ పరిశీలించింది.అంతేగాక ఈకమిటీ కేరళ రాష్ట్రంలో పర్యటించి అక్కడ సంబంధింత శాఖల అధికారులతో సమావేశం కావడంతోపాటు ఢిల్లీలోని ఇన్ లాండ్ వాటర్ వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఇంజనీర్లను,నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ అధారిటీ సభ్యులుతోను సమావేశమై ఇన్ లాండ్ వాటర్ వేస్ రవాణాకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించడం జరిగింది.ఈకమిటీ ఇప్పటికే గత మార్చి 8వతేదీన బోటు యాక్సిడెంట్లపై మధ్యంతర నివేదికను సమర్పించగా శుక్రవారం తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.చివరగా వివిధ అంశాలను పరిశీలించిన మీదట ఈకమిటీ తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
Tags:
News