పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు

నెల్లూరు,సెప్టెంబరు28(way2newstv.com)
    నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు.  కారు అద్దాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. నెల్లూరు కి చెందిన వెంకారెడ్డి  అనే కాంట్రాక్టర్ చలానా కట్టేందుకు ఐదు తొమ్మిది లక్షలతో  కారులో ఆత్మకూరులోని యస్బిఐ బ్యాంక్ వద్దకు వచ్చాడు. చలానా కు అవసరమైన నగదును తీసుకొని మిగిలిన ఒక  లక్ష 90 వేల నగదును కారులోనే ఉంచి వెళ్వచ్చ 

అనంతరం బ్యాంకు పక్కనే హోటల్ ఉండడంతో భోజనం చేసేందుకు హోటల్ కి వెళ్ళాడు.జోరుగా వర్షం పడుతూ ఉండటంతో హోటల్లోనే అరగంట సేపు ఉండి పోయాడు. వర్షం కారణంగా వీధిలో ఎవరు లేకపోవడంతో అదునుగా భావించిన దొంగ కారు అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న ఒక  లక్ష తొంబై వేలు నగదును ఎత్తుకెళ్లాడు. వర్షం తగ్గేసరికి కారు దగ్గరికి వచ్చిన వెంకారెడ్డి అతని సోదరుడు  చోరి జరిగినట్లు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Previous Post Next Post