ఫిబ్రవరి 2న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫిబ్రవరి 2న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

కర్నూలు, జనవరి, 31 (way2newstv.com):
బనవాసి లోని  జవహార్ నవోదయ విద్యాలయలోకి 2019-20 విద్యా సంవత్సరానికి గాను తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి ప్రవేశపరీక్ష ఫిబ్రవరి 2  న  నవోదయ విద్యాలయ. బనవాసిలో జరుగుతుందని విద్యాలయ ప్రిన్సిపాల్  కె.చంద్రశేఖరన్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోనికునేందుకు ఎన్ వి ఎస్ అడ్మినేషన్ క్లాస్ ఇన్ అనే  వెబ్ సైట్ లోకి వెళ్ళి డౌన్ లోడ్ చేసుకోవలసినదిగా ఆయన తెలియజేశారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తమ హాల్ టికెట్ తో పాలు, రైటింగ్ పాడ్, బ్లూ  లేదా బ్లాక్ పెన్ను తమతో తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12.30 గం వరకు జరుగుతుందన్నారు. విద్యార్ధులు 2వతేదీ ఉదయం 9.30 గం లోపు తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయ బనవాసిలో రిపోర్టు చేయాలి. ఎట్టి పరిస్థితులలో 9.30 ఉదయం లోగా విద్యాలయానికి వచ్చి రిపోర్టు చేయాలని ప్రిన్సిపాల్ కోరారు.


ఫిబ్రవరి 2న జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష