ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి

జగిత్యాల  జనవరి, 31 (way2newstv.com):
ఉద్యోగులు, పెన్షనర్లు ఫిబ్రవరి 2019 మాసంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలని జిల్లా టీ ఉద్యోగ ఐ కా స గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తెలిపారు. ఉద్యోగులు ఫిబ్రవరి నెల 20 లోపు, పెన్షనర్లు ఫిబ్రవరి 15లోపు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలని, దానికి సంబంధించి ఆదాయపు పన్ను ఎంత చెల్లించాలో పెన్షనర్లకు సంబంధించి తమ తెలంగాణ పెన్షనర్ల అసోసియేషన్ జగిత్యాల జిల్లా కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం సంప్రదించవచ్చని తెలిపారు.60 సంవత్సరాల పైబడిన పెన్షనర్లకు వడ్డీ ఆదాయంపై రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.


 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలి
Previous Post Next Post