మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

జగిత్యాల జనవరి 31  (way2newstv.com):
బడ్జెట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని టిబిసి జె ఏ సి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నేతాజీ కళాశాల సమావేశ మందిరంలో మహిళా ఐకాస జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఏకీభవిస్తే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పన సాకారం అవుతుందన్నారు. 


 మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి

రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందిన బిల్లును లోకసభ లో ఆమోదం పొందడానికి ఉన్న ఆటంకం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు 15 వ లోకసభ ఆమోదం పొందకుండా పెండింగ్ లో ఉండిపోయిందని, చట్టసభల్లో 33 శాతం స్థానాలను రిజర్వు చేయడానికి ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించాలన్నారు. బిల్లు ఆమోదానికి పార్లమెంట్ లో పోరాడుతున్న ఎంపీ కవిత కు తమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా టిబిసి మహిళ ఐ కా స అధ్యక్ష ,కార్యదర్శులు పుప్పాల విజయ ,కస్తూరి శ్రీ మంజరి భారతి, కోరుట్ల నియోజకవర్గ మహిళా జేఏసీ అధ్యక్షురాలు గాండ్ల మధురిమ, టిబిసి జెఏసి అధ్యక్షులు రాజగోపాలచారి, రాష్ట్ర నాయకులు బండారి విజయ్, సింగం భాస్కర్, గట్ల మహేష్, నరసింహ చారి, కుసరి అనిల్ కుమార్ ,పుప్పాల నర్సింగ రావు ,కరుణ, విజయలక్ష్మి లు పాల్గొన్నారు.