మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవు: ఏపీ సర్కార్ నిర్ణయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవు: ఏపీ సర్కార్ నిర్ణయం

అమరావతి ఫిబ్రవరి 9 (way2newstv.com
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అటు అధికార.. ఇటు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. పోటాపోటీగా పెన్షన్ల పెంపు, రిజర్వేషన్ల వ్యవహారం ఇలా పలు విషయాల్లో టీడీపీ వరాలు కురిపిస్తోంది. 


 మహిళా ఉద్యోగులకు 12 నెలల ప్రసూతి సెలవు: ఏపీ సర్కార్ నిర్ణయం

అయితే తాజాగా..  కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌‌తో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు శుభవార్త చెప్పారు. మరీ ముఖ్యంగా 12 నెలల ప్రసూతి సెలవు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.