మార్చి 29న విడుదల కానున్న నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మార్చి 29న విడుదల కానున్న నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం.

(way2newstv.com):
యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం అర్జున్ సురవరం. ఈ చిత్రానికి ముందుగా ముద్ర టైటిల్ ఖరారు చేసినా.. ఇప్పుడు ఆ టైటిల్ ను అర్జున్ సురవరంగా మార్చారు చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగో విడుదలైంది. ఈ టైటిల్ లాంచ్ కార్యక్రమంలో హీరో నిఖిల్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, దర్శకుడు సంతోష్, నిర్మాతలు పాల్గొన్నారు. యూరప్ లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అర్జున్ సురవరం.


  మార్చి 29న విడుదల కానున్న నిఖిల్ అర్జున్ సురవరం చిత్రం.

 మార్చి 29న ఈ చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు చిత్ర యూనిట్. ఇందులో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. 
న‌టీన‌టులు: 
నిఖిల్ సిద్ధార్థ్, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు..