సిరిసిల్లలో ఐదు రూపాయిలకే భోజనం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిరిసిల్లలో ఐదు రూపాయిలకే భోజనం

కరీంనగర్, ఫిబ్రవరి 8 (way2newstv.com)
టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ సిరిసిల్ల పట్టణంలో పర్యటిస్తున్నారు. పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పూర్తయిన పనులను కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అక్షయపాత్ర రూ. 5 భోజన పథకాన్ని కేటీఆర్‌ ప్రారంభించారు. ఎమ్మెల్యే పాల్గొనే తదుపరి కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నెహ్రూనగర్ లో వైకుంఠధామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. 2.30 గంటలకు పట్టణం శివారులో గుమ్‌షావలి దర్గాను సందర్శించారు. 3 గంటలకు సిరిసిల్లలో మా ర్కండేయ శోభాయాత్రలో పాల్గొన్నారు. 6.30 గంటలకు తడిచెత్త, పొడి చెత్త సేకరణ బ్యాటరీ వాహనాలు, 7 గంటలకు బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. 7.30 గంటలకు బతుకమ్మ ఘాట్‌వద్ద స్త్రీనిధి టాబ్స్ పంపిణీ చేశారు.

 
సిరిసిల్లలో ఐదు రూపాయిలకే భోజనం 

 ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు కేటీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో వైపు సిర్పూర్ కాగితపు పరిశ్రమలో మళ్లీ కాగితపు ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 2014లో మూతపడ్డ ఈ కంపెనీ మళ్లీ తెరుచుకోవడంపై కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.‘గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సిర్పూర్ పేపర్ మిల్లు మళ్లీ తెరుచుకోవడంతో పాటు ఉత్పత్తి ప్రారంభమయింది. దీనివల్ల వందలాది మంది కార్మికుల జీవితాల్లో సంతోషం నిండనుంది. ఇందుకోసం ప్రత్యేక చోరవ చూపిన పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్ గారికీ, ఆయన టీమ్ కు అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిన అనేక మూతపడ్డ పరిశ్రమల్లో సిర్పూర్ మిల్లు ఒకటి’ అని ట్వీట్ చేశారు.నిజాం కాలంలో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును స్థాపించారు. 1950లో బిర్లాగ్రూప్ దీన్ని టేకోవర్ చేసింది. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-08 మధ్యకాలంలో మిల్లును ఐడీబీఐకు తాకట్టు పెట్టింది. అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న సంస్థ మూతపడింది.అప్పటికే 3,200 మంది కార్మికులు పేపర్ మిల్లుపై ఆధారపడి బతుకుతున్నారు. 2016 అక్టోబర్ 22న ఈ మిల్లును ఐడీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది.