ఢిల్లీ అధికారాలపై సుప్రీం తీర్పు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఢిల్లీ అధికారాలపై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (way2newstv.com)
ఢిల్లీ ప్రభుత్వం,లెఫ్టి నెంట్ గవర్నర్ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు కీలక  తీర్పు నిచ్చింది. ఢిల్లీ అధికారాలను ముఖ్యమంత్రికి అప్పగించింది.  ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అధికారాల విషయంలో తలెత్తిన వివాదంపై జస్టిస్ ఎకె సిక్రి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. జాయింట్ సెక్రటరీలు, అంతకంటే పెద్ద పోస్టుల్లో అధికారులను బదిలీ చేసే అధికారం ఎల్జికి ఉంటుందని, ఇతర అధికారులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారని ధర్మాసనం పేర్కొంది. 


ఢిల్లీ అధికారాలపై సుప్రీం తీర్పు

ఢిల్లీ పై నియంత్రణ, అధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయని, భూములు, పోలీస్ వ్యవస్థపై ఎల్జికి అధికారాలు ఎల్జికి ఉంటాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆరు అధికారాల విషయంలో సృష్టతనిచ్చిన సుప్రీం, కీలకమైన నాలుగు అంశాల్లో నిర్ణయాధికారం కేంద్రానిదేనన్న స్పష్టం చేసింది. జాయింట్ సెక్రెటరీ, ఆపై అధికారులను బదిలీచేసే అవకాశం లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు, ఏసీబీ,గ్రేడ్ 1,2,అధికారుల పోస్టింగ్, బదిలీల అధికారం కేంద్రానిదేనని సృష్టం చేసింది. గ్రేడ్ 3,4,పోస్టింగ్, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికే అధికారాలు వుంటాయిన చెప్పింది. కోర్టుల్లో న్యాయవాదులను నియమించుకునే అధికారాన్ని ఢిల్లీ ప్రభుత్వానికిచ్చిన సుప్రీం, ఇతర అధికారాల పరిధి తేల్చేందుకు కేసును విస్తృత ధర్మసనానికి బదిలీ చేసింది. తీర్పుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అధికారులను బదిలీ చేసుకునే అధికారం లేనప్పుడు ప్రభుత్వం ఎలా కార్యకలాపాలు నిర్వహించగలదని ప్రశ్నించారు. 67 సీట్లు ఉన్న పార్టీకి అధికారాలు లేవు కానీ, 3 సీట్లు గెలుచుకున్న పార్టీకి అధికారాలు ఉన్నాయని ఆయన అన్నారు.