మెడికల్ హబ్ గా ఏపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మెడికల్ హబ్ గా ఏపీ

తాళ్లూరు, ఫిబ్రవరి 14 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్ గా మారనుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం  తుళ్లూరులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మా అత్తయ్య కు కాన్సర్ వచ్చినప్పుడు సరైన వైద్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము అందుకే బసవతారకం ఆసుపత్రి ప్రారంభించాం. కాన్సర్ రోగులను ఆదుకోవడానికి ఎన్ఠీఆర్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు.


మెడికల్ హబ్ గా ఏపీ

ప్రస్తుతం కొన్ని లక్షల మందికి వైద్యం ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అప్పటి ప్రధాని వాజపేయి బసవతారకం ఆసుపత్రిని ప్రారంభించారు. ఎన్ఠీఆర్ స్ఫూర్తిని బాలకృష్ణ కొనసాగిస్తున్నారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్ఠీఆర్. తెలుగు జాతి గుండెల్లో ఎన్ఠీఆర్ ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. ఒక్క పైసా దుర్వినియోగం లేకుండా నమ్మకంగా ఈ ట్రస్ట్  ఉంది. ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో దేశానికే మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు. బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ ద్వారా సేవలందిస్తుంటే భువనేశ్వరి ఎన్ఠీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా సేవలందించటం అభినందనీయమన్నారు. కాన్సర్ ను నివారణకు ముందస్తు జాగ్రత్తలు అవసరం.   ప్రజల్లో కాన్సర్ పై అవగాహన పెరగాలని అయన అన్నారు. కాన్సర్ ను చూసి బయపడితే చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. అమరావతికి 14 పెద్ద మెడికల్ కాలేజీలు,14 ఆసుపత్రులు వస్తున్నాయి. కాలుష్య నివారణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కొత్త సంస్థలు వస్తున్నాయంటే ఇక్కడ భూములిచ్చిన ఘనత రైతులదేనన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచానికే నమూనా అన్నారు.