భారత్ కు పెరుగుతున్న మద్దతు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

భారత్ కు పెరుగుతున్న మద్దతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20  (way2newstv.in): 
జైషే మ‌హ్మ‌ద్ సంస్థ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ను .. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు భార‌త్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ర‌ష్యా త‌న స‌హ‌కారాన్ని ప్ర‌క‌టించింది. ఐక్యరాజ్య‌స‌మితిలో ఈ విష‌యంపై మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ర‌ష్యా మంత్రి డెనిస్ మంటురోవ్ తెలిపారు. మ‌సూద్ అజ‌ర్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టించేందుకు ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లిలో వ‌త్తిడి తెస్తామ‌ని ఆయ‌న చెప్పారు. 


 భారత్ కు పెరుగుతున్న మద్దతు 

పుల్వామా దాడిని ఖండించిన ఆయ‌న‌.. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. ఉగ్ర‌వాదంపై పోరులో భార‌త్‌కు స‌హ‌క‌రిస్తామ‌న్నారు. పుల్వామా కారు బాంబు దాడిని బ్రిట‌న్ హై క‌మిష‌న‌ర్ కూడా ఖండించారు. బ్రిట‌న్‌తో పాటు భార‌త్ కూడా ఉగ్ర‌దాడులను ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని, క‌శ్మీర్‌లో జ‌రిగిన సంఘ‌ట‌న ప‌ట్ల చింతిస్తున్నామ‌ని హై క‌మిష‌న‌ర్ డామినిక్ అక్విత్ తెలిపారు. ఉగ్ర‌దాడులు ఎక్క‌డ జ‌రిగినా వాటిని వ్య‌తిరేకిస్తామ‌న్నారు.