రాజకీయాల కోసం సైన్యాన్ని అగౌరవ పరచొద్దు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (way2newstv.com)
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశం కోసం అమరులైన జవాన్లను అవమానించారని మండిపడ్డారు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. రాజకీయాల కోసం సైన్యాన్ని, జవాన్లను అగౌరవపరొచ్చదని హితవు పలికారు. జవాన్లు దేశం కోసం పోరాడుతున్నారు.. డబ్బు కోసం కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాఫెల్ డీల్‌‌పై రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు కౌంటర్‌గా.. రాజ్యవర్థన్ ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘రాహుల్‌కు మిలటరీ గురించి ఏమీ తెలియదు. 


 రాజకీయాల కోసం సైన్యాన్ని అగౌరవ పరచొద్దు

ఢిల్లీలో ప్రతి రోజూ ప్రెస్ మీట్ పెట్టే రాహుల్.. మన మిలటరీని అవమానించారు. ఈ మట్టిలో జన్మించిన ఎవరైనా మన మిలిటరీకి, దేశం కోసం అమరులైన జవాన్లను గౌరవించాల్సిందే. మన జవాన్లు దేశం కోసం యుద్ధం చేస్తున్నారని గమనిస్తే మంచిది. డబ్బు కోసం కాదు.. దేశాన్ని కాపాడటం కోసం యుద్ధం చేస్తున్నారు. మీ రాజకీయాలు మీరు చేసుకోండి తప్పులేదు.. కాని మన సైన్యాన్ని, అమరులైన జవాన్లను మాత్రం అవ2మానించొద్దు. ఓ జవాన్‌గా మీకు చెప్పదలచుకున్నా’అన్నారు రాజ్యవర్థన్. రాహుల్ గాంధీ  ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.. రాఫెల్‌ డీల్‌పై బీజేపీని టార్గెట్ చేశారు. రాఫెల్ డీల్‌లో అనిల్ అంబానీకి ఇచ్చిన రూ.30వేల కోట్లను విమాన ప్రమాదాల్లో చనిపోయే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు ఇవ్వాలన్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఈ వీడియోను ట్వీట్ చేశారు. 
Previous Post Next Post