యూపీలో ప్రియాంక షో

లక్నో, ఫిబ్రవరి 11 (way2newstv.com)
కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ దూకుడు పెంచారు. పార్టీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక లక్నోలో పర్యటించారు. సోమవారం నగరంలో సోదరుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి రోడ్‌ షోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రియాంకకు కాంగ్రెస్ శ్రేణుల నుంచి ఘన స్వాగత లభించింది. నగరంలోని అమౌసి ఎయిర్‌పోర్టు నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. 


 యూపీలో ప్రియాంక షో

మరోవైపు ప్రియాంక ట్విట్టర్‌‌‌లోకి అడుగు పెట్టారు. కొద్దిసేపటికే వెరిఫైడ్ అకౌంట్‌గా ట్విట్టర్ కూడా ప్రకటించింది. అకౌంట్ యాక్టివ్ అయిన గంటల్లోపే 50వేలమందికిపైగా ఫాలోవర్లు వచ్చేశారు. ఇప్పటి వరకూ ఆమె ఎలాంటి ట్వీట్ చేయలేదు. ప్రియాంక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించినట్లు కాంగ్రెస్ కూడా ప్రకటించింది. 
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో.. ప్రియాంకకు పార్టీ బాధ్యతల్ని అప్పగించారు. ఆమెకు బీజేపీకి కంచుకోటగా ఉన్న 40 లోక్‌సభ స్థానాల బాధ్యతల్ని అప్పగించారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఎంపీగా పనిచేసిన గోరఖ్‌పూర్‌ సీట్లు ఉన్నాయి.
Previous Post Next Post