వైకాపాలో చేరిన కిల్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైకాపాలో చేరిన కిల్లి

హైదరాబాద్,ఫిబ్రవరి 19, (way2newstv.com
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వెల్లడించారు. మంగళవారం ఆమె లోటస్ పాండ్లో వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ  ఈనెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు తెలిపారు. వైఎస్ జగన్ ను సీఎం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. 


వైకాపాలో చేరిన కిల్లి

బీసీ గర్జనలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను పూర్తిగా విశ్వసిస్తున్నానన్నారు. చంద్రబాబు బీసీలను వాడుకొని వదిలేస్తారు.. వైఎస్ జగన్ మాట తప్పరు, మడమ తిప్పరని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారని, ఏపీ ప్రజలు ఆయన మాటలు విశ్వసించరని అన్నారు. కాంగ్రెస్, టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకించానని అన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశానని వెల్లడించారు. బీసీలను, కులవృత్తుల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. టిక్కెట్ ఆశించి రాలేదని, భేషరతుగా వైఎస్సార్ సీపీలో చేరనున్నట్టు కృపారాణి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు