అబ్కారీ ఫిర్యాదులపైకాలపరిమితితో కూడిన విచారణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అబ్కారీ ఫిర్యాదులపైకాలపరిమితితో కూడిన విచారణ

రాష్ట్ర మధ్య నిషేధం,  అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా
విజయవాడ, ఫిబ్రవరి 19, (way2newstv.com
అబ్కారీ విధానాలకు సంబంధించి ప్రజలనుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పూర్తి స్ధాయిలోవిచారణ చేయవలసిందేనని, దానికి సంబంధించినవిచారణ నివేదికను సైతం తిరిగి వారికిఅందుబాటులో పొందుపరచాలని రాష్ట్ర మద్య నిషేదం, అబ్కారీ శాఖ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఫిర్యాదులకు సంబంధించి విభాగ పరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామన్నది వారికి తెలియచెప్పటం కూడా కీలకమైన అంశమని అభిప్రాయపడ్డారు. మంగళవారం విజయవాడ రూరల్,  ప్రసాదం పాడులోని అబ్కారీ శాఖ రాష్ట్రకార్యాలయంలో ఫిర్యాదుల నిర్వహణ విధానంపై ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపధ్యంలోమీనా పలు అదేశాలు జారీ చేస్తూ రానున్నది ఎన్నికల సమయం, సిబ్బంది పూర్తి స్ధాయిలోఅప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు.


అబ్కారీ ఫిర్యాదులపైకాలపరిమితితో కూడిన విచారణ

ప్రత్యేకించి ఈ సమయంలో వచ్చే ఫిర్యాదులను సాదాసీదాగా తీసుకోరాదని స్పష్టం చేసారు. కేవలంఎన్నికల ఫిర్యాదుల కోసమే రాష్ట్ర స్ధాయిలో ఒక ప్రత్యేక  అధికారిని నియమించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఫిర్యాధుల పరిష్కార విభాగానికి పూర్తి స్ధాయిలో జవసత్వాలు  కల్పించాలని సూచించారు. అందుబాటులో ఉన్న సాంకేతికతను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఎప్పటి కప్పడు అవసరమైన  సమాచారం రాష్ట్ర కార్యాలయానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
బెల్ట్ షాపులు, ఐడి పార్టీల దాడులు, మొబైల్ పార్టీ పనితీరు వంటిఅంశాలపై కూడా రోజువారి నివేదికలు అవసరమని, మరోవైపు ఎన్నికల సంఘం కోరిన ఫార్మెట్లోనివేదికలు ఉండాలని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. నేరాలకు  సంబంధించి జిల్లాల మధ్య పోలికను చూపుతూ సమాచారం సిద్దం కావాలన్నారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ సగటు  ప్రజలు ఎవరైనా మద్యం విక్రయాలకు సంబంధించి తమ ఫిర్యాదులు నమోదుచేసుకోవచ్చన్నారు. సాధారణ  రాత పూర్వక ఫిర్యాదుతో పాటు ఈ మెయిల్, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్, వెబ్, తపాలా తదితర ఏవిధానంలోనైనా తాము ఫిర్యాదు స్వీకరించి తీసుకున్న చర్యలను వెల్లడిస్తామన్నారు. ఫిర్యాదు అందిన తదుపరి తక్షణమే  గంటల వ్యవధిలోస్పందించేలా తమ ప్రణాళిక సిద్దం చేసామన్నారు. ఈ ఉన్నత స్ధాయి సమీక్షలో ఎక్సైజ్ శాఖ అదనపు కమీషనర్ కెఎల్ భాస్కర్ , జాయింట్ కమీషనర్ చంద్రశేఖర్ నాయిడు, ఓఎస్డి నాగేశ్వరరావు, డిప్యూటీకమీషనర్ - కంప్యూటర్స్ రేణుక, సహాయ కార్యదర్శి - ఎన్ఫోర్స్మెంట్ ప్రణవి, సహాయ కార్యదర్శి- కేంద్రకార్యాలయం సత్య ప్రసాద్,  ఐటి కన్సల్ టెంట్ కిషోర్  తదితరులు పాల్గొన్నారు