కోలుకుంటున్న మధులిక

హైద్రాబాద్, ఫిబ్రవరి 8 (way2newstv.com)
ఇంటర్ యువతి మధులికపై కొబ్బరి బొండాం కత్తితో దాడిచేసిన నిందితుడు భరత్ ను పోలీసులు  నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం నిందితుడిని రిమాండ్ కు తరలించాలని ఆదేశించింది. మరోవైపు మధులిక చికిత్స విషయంలో 48 గంటల పాటు వైద్యులు పడిన శ్రమకు కాస్త ఫలితం దక్కింది.ఐదుగురు డాక్టర్ల బృందం7 గంటలపాటు శ్రమించి నాలుగు సర్జరీలు చేశారని యశోదా ఆసుపత్రి సీఓఓ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 28 యూనిట్ల రక్తాన్ని ఎక్కించామని వెల్లడించారు,


కోలుకుంటున్న మధులిక

 మధులిక కాస్త కోలుకుందని, సైగలు కూడా చేస్తోందని తెలిపారు. మధులిక బ్రెయిన్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మరో 48 గంటల పాటు గడిస్తేనే కానీ ఆమె ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్పలేమని అన్నారు. మూడు రోజుల క్రితం ఉన్మాది భరత్ చేతిలో కత్తిపోట్లకు గురైన ఇంటర్ విద్యార్థిని మధులిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు మలక్‌పేట యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. నిన్న రాత్రి బాధితురాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిన్నటితో పోల్చుకుంటే కొద్దిగా మెరుగుపడిందని స్పష్టం చేశారు. 48 గంటల పాటు అందించిన వైద్యం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ప్రస్తుతం కళ్లు తెరిచి చూడగల్గుతున్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణ అవసరమని వైద్యులు పేర్కొన్నారు
Previous Post Next Post