రఫేల్ ఫై లోక్సభలో మరో సారి రగడ

న్యూఢిల్లీ ఫిబ్రవరి 8  (way2newstv.com)
రఫేల్‌ ఒప్పందంలో లోక్‌సభలో మరోసారి రచ్చ జరిగింది. ఈ ఒప్పందంపై రక్షణశాఖకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందంటూ ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై ధ్వజమెత్తారు. రఫేల్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. 


రఫేల్ ఫై లోక్సభలో మరో సారి రగడ

ప్రతిపక్షాల ఆరోపణలను రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ అదే స్థాయిలో తిప్పికొట్టారు. రఫేల్‌పై తాము చెప్పాల్సిందంతా చెప్పేశామని, దీనిపై ఇంకా మాట్లాడటం సమయం వృథా అని అన్నారు.‘రఫేల్‌ ఒప్పందంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. పీఎంవో సమీక్షను జోక్యం చేసుకోవడం అని చెప్పలేం. రక్షణశాఖ నివేదికకు అప్పటి రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌ వివరణ ఇచ్చారు. దాని గురించి మీడియా ఎక్కడా చెప్పలేదు. ఒప్పందం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగా జరిగింది. దీనిపై మేం ఇటు పార్లమెంట్‌లోనూ అటు కోర్టులోనూ స్పష్టతనిచ్చాం. ఇంకా దీనిపై మాట్లాడటం సమయం వృథా’ అని నిర్మలా సీతారామన్‌ దీటుగా బదులిచ్చారు.కాంగ్రెస్‌ కావాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, సైన్యం, వైమానిక దళాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె దుయ్యబట్టారు. ఇది చాలా ప్రమాదకరమన్నారు. మల్టీనేషనల్‌ కంపెనీల చేతుల్లో ప్రతిపక్షం కీలుబొమ్మలా మారిందని ఎద్దేవా చేశారు.
Previous Post Next Post