పర్యాటక శాఖ వినూత్న ఆలోచన
వరంగల్, ఫిబ్రవరి 8, (way2newstv.com)
టూరిస్టులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలకు శ్రీకారం చుడుతున్నది. టూరిస్టులకు తెలంగాణ ఆతిథ్యం రుచి చూపించాలని నిర్ణయించింది. కేరళ తరహాలో హోం స్టే విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఈ విషయమై విస్తృత ప్రచారానికి పర్యాటక శాఖ సమాయత్తమవుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను టూరిస్టులకు పరిచయం చేయడానికి పలురకాలుగా ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో అనేక చారిత్రాత్మక కట్టడాలు, పురాతన వస్తువులు, భారీ ప్రాజెక్టులు, విస్తరించిన దట్టమైన అడవులు, కృష్ణా, గోదావరి వంటి జీవ నదులు,400 ఏండ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరం ఇలా అనేక ప్రత్యేకతలు ఉన్న రాష్ట్రం పలు విదేశీయులు సైతం ఆకర్షితులవుతున్నారు. టూరిస్టులు సాధారణంగా హోటళ్లను ఆశ్రయిస్తుంటారు. వీరు హోటల్‌కే పరిమితం కావడంతో మన సంస్కృతి, సంప్రదాయాలు తెలిసే అవకాశం ఉండటం లేదు.
తెలంగాణల్లో హోం స్టే
ఈ నేపథ్యంలో 'హోంస్టే'కు శ్రీకారం చుట్టింది. సొంతిల్లు ఉండి ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు తమ ఇండ్లలో ఆశ్రయం ఇచ్చి టూరిస్టులకు అతిథి మర్యాదలు చేయవచ్చు. అందుకు టూరిజం శాఖ అనుమతి తీసుకోవాలి. 'హోం స్టే అంటే టూరిస్టులు మన ఇంట్లోనే ఉంటారు. వారు తింటారు. మనతోపాటే ఉంటారు. వారికి కావాల్సిన సౌకర్యాలను ఇంటి యాజమాని ఏర్పాటు చేస్తాడు. అందుకు యాజమానే తగిన ప్యాకేజీ రూపొందిస్తారు'. దీంతో టూరిస్టులకు తెలంగాణ గొప్పతనం తెలియజేసే అవకాశం ఉందని సర్కారు ఆలోచన. హోంస్టే పద్దతి కేరళలో దిగ్విజయంగా అమలవుతున్నదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఈ విధానాన్ని హైదరాబాద్‌లో ప్రవేశపెట్టి రెండున్నరేండ్లు గడిచినా...తగినంత ప్రాచుర్యం దక్కలేదు. దీంతో మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో హోంస్టేపై విస్తృతంగా ప్రచారం చేసేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతున్నది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విశిష్టతలను ప్రపంచానికి చాటేలా టూరిజం శాఖ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త ప్యాకేజీలు, ఆన్‌లైన్ బుకింగ్, హోటళ్ల అనుసంధానం, రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం తదితర చర్యలు చేపట్టింది. దక్షిణ భారతదేశంలోనే అందమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న కేరళ రాష్ట్రం తరహాలో రాష్ట్రాన్ని మలచాలని ప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ పర్యాటక శాఖ టూరిస్టులను ఆకర్షించడానికి ఇటీవల 'హోంస్టే ఎస్టాబ్లీష్‌మెంట్ స్కీమ్'ను ప్రకటించింది. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర పర్యటనకు వస్తున్న
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కైట్ పెస్టివల్, స్వీట్ పెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే... చైనా, థాయిలాండ్, ఇండోనేషియా, టర్కీ వంటి దేశాల నుంచి నిపుణులు హైదరాబాద్ రావడంతో అభిమానులు రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. ' ప్రపంచ మార్పు కోసం బాలికలు ,మహిళలు చైతన్యవంతంగా పైకి ఎగరాలి' అనే నినాదంతో కైట్ పెస్టివల్‌ను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించింది. 25 రాష్ట్రాల స్టాళ్లను స్వీట్ పెస్టివల్‌లో ఏర్పాటు చేశారు. గూగుల్ చరిత్రలో మొదటిసారిగా అంతర్జాతీయ కైట్, స్వీట్ పెస్టివల్‌ను గూగుల్ 360 డిగ్రీలలో ఉచితంగా ఫోటో షూట్ చేసి ప్రపంచానికి తెలియజేసిందని, ఇది తెలంగాణకు గర్వకారణమని పర్యాటక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా కనిపించే ఒగ్గుడోలు, కోలాటం, బంజారా, లంబాడా, డప్పుల కళాకారులతో అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇప్పించింది. ముఖ్యంగా సమ్మక్క, సారక్క జాతర యూనెస్కో దృష్టిని ఆకర్షించింది. దీంతో తెలంగాణ టూరిజం శాఖ ఎనిమిది జాతీయ అవార్డులు దక్కాయి.
Tags:
telangananews