ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలి

అనంతపురం, ఫిబ్రవరి 1, (way2newstv.com) 
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని జడ్పీ ఛైర్మన్ పూల నాగరాజు, నగర మేయర్ మదమంచి స్వరూప కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కేంద్రం వైఖరికి నిరసనగా మేయర్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు, వందలాది మంది విద్యార్థినులతో స్థానిక జడ్పీ కార్యాలయం ఎదుట ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మదర్ థెరిస్సా విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు..సేవ్ ఆంధ్రప్రదేశ్..విభజన చట్టంలో చెప్పిన హామీలు వెంటనే అమలు చేయాలి.. కరవు జిల్లా అనంతలో పరిశ్రమలు నెలకొల్పాలి.. 


ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలి

అనంతలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేయాలి.. కడప ఉక్కుకర్మగారానికి నిధులు విడుదల చేయాలి.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీకి న్యాయం చేస్తారని కేంద్రం ఆఖరి బడ్జెట్ వరకు ఇన్నాళ్లు ఎదురుచూశాం.. మా సహనం పూర్తిగా నశించి పోయింది.. 5ఏళ్లు చూసినా ప్రధాని మోది చేసిందేమీ లేదంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు పీఎం నరేంద్ర మోడీ తిరుపతికి వచ్చిన సందర్బంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలుకు కట్టుబడి ఉన్నామంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.  అధికారంలోకి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను గుర్తించక పోగా.. విభజన హామీలను కూడా విస్మరించారన్నారు. దేశంలో ఏపీ రాష్ట్రం కూడా అంతర్భాగమేనని, ఏపీ పై చిన్నచూపు తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల, విభజన హామీల అమల్లో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య ధోరణి ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా మోడీ వ్యవరించాలన్నారు. ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకొని ఆపదలో ఉన్న ఏపీని ఈ చివరి బడ్జెట్లో నైనా అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు విశాలాక్షి, వేణుగోపాల్, రామలింగారెడ్డి, ఎంపిపి మాధవి, టీడీపీ నేత ఉన్నం మారుతి నాయుడు, కార్పొరేటర్ రహమత్ బీ, తెలుగు మహిళలు సరిత, మహేశ్వరి, మనెమ్మలతో పాటు వందలాదిగా విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.