నల్లచొక్కాతో అసెంబ్లీకి సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 1, (way2newstv.com) 
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు  శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన సమితి  నిర్వహిస్తున్న ఆందోళనకు  సంఘీభావంగా అయన  నల్లచొక్కా ధరించారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు కార్యచరణ ప్రకటించారు. 


నల్లచొక్కాతో అసెంబ్లీకి సీఎం చంద్రబాబు

 విభజన చట్టం అమలులో  కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు ఫిబ్రవరి 1ని నిరసన దినంగా పాటించాలని పిలుపిచ్చిన విషయం తెలిసిందే. పార్టీ  ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. 
Previous Post Next Post