టిచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టిచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి

హైదరాబాద్ ఫిబ్రవరి 12 (way2newstv.com)
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా 8792 టిచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి 18 నెలలు గడిచిన ఇంతవరకు తుది ఫలితాలు ప్రకటించకుండా విద్యార్థుల జీవితాలతో చలగాటం అడుతున్నారు. వెంటనే ఫలితాలు ప్రకటించాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. ఈ రోజు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా జరిపారు. “చలో హైదరాబాద్” పిలుపుమేరకు వివిధ జిల్లాలనుంచి వందలాది నిరుద్యోగ అభ్యర్థులు వచ్చి ధర్నాలో పాల్గొన్నారు. 4 నెలలలో రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేయవలిసిన సర్వీస్ కమీషన్ వారు 18 నెలలు గడిస్తే కూడా పూర్తి చేయడం లేదు.


 టిచర్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి

 దీని మూలంగా ఒకవైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఇంకొకవైపు పాటశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ప్రభుత్వ పాటశాలల్లో 45 వేల టిచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 8792 టిచర్ పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. ఇవి కూడా పోస్టింగ్ ఇవ్వకుండ జాప్యం చేస్తున్నారు. 5 సంవత్సరాలలో ఒకే నోటిఫికేషన్ వేసి వీటిని కూడా ఏళ్ల తరబడి భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు. సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాటశాలలో టిచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన 4 నెలలలో మొత్తం ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్ ఇస్తుంటే సర్వీస్ కమీషన్ వారు ఉద్యోగాల భర్తీకి ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నారని విమర్శించారు. 6 నెలల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇస్తూ ప్రభుత్వ పాటశాలలో టీచర్లు లేక విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని, నెల రోజులలోగా భర్తీ చేయాలనీ రెండు సార్లు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం మరియు సర్వీస్ కమీషన్ వారు ఖాతరు చేయడంలేదని విమర్శించారు. టీచర్లు లేక ప్రభుత్వ పాటశాలలు మూతపడుతున్నాయన్నారు. టీచర్లు లేరనే కారణంతో అతి పేదవారు, రోజు కూలీలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాటశాలలకు పంపడంలేదు. అప్పులు చేసి ప్రైవేటు పాటశాలలకు పంపుతున్నారన్నారు. సర్వీస్ కమీషన్ నిర్వహించిన పరీక్షలకు 4 లక్షల మంది పరిక్షలు వ్రాయగా సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కు 27 వేల మందిని ఎంపిక చేశారు. ఫైనల్ జాబితా ప్రకటించాలి. కాని కోర్టు కేసుల సాకుతో ఫైనల్ లిస్టు పెట్టకుండా జాప్యం చేస్తున్నారు. కోర్టు ఈ కేసుల విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఒక రోజులో తీర్పు వస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును నిరుద్యోగుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫైనల్ సెలక్షన్ జాబితా ఫలితాలు ప్రకటించి, నియామకపు పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, దాసు సురేష్, జైపాల్ ముదిరాజ్, సంతోష్, రవితేజ, ప్రవీణ్, నిర్మల, సుమలత, రాము, సాయికుమార్  తదితరులు పాల్గొన్నారు.