సాగునీటికి పెద్దపీట - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సాగునీటికి పెద్దపీట

హైదరాబాద్, ఫిబ్రవరి 21,  (way2newstv.com)
ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించి తాజా తాత్కాలిక బడ్జెట్లో రూ.1810 కోట్లు కేటాయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విధివిధానాల రూపకల్పన కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సభలో కేసీఆర్ మాట్లాడుతూ  ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన వృద్ధాప్య పెన్షన్ ఏ అవసరానికి సరిపోయేది కాదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆత్మగౌరవంతో బతికేలా పెన్షన్లు ఇస్తున్నాం. నిస్సహాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఊరటనిస్తున్నాయని అన్నారు.  


 సాగునీటికి పెద్దపీట

సేవల రంగంలో 15.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని ఆశిస్తున్నాం.  2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 15 శాతంగా వుంది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి రెండేళ్ల ముందు జీఎస్డీపీ దేశ సగటు కన్నా తక్కువగా ఉందని అన్నారు. తాత్కాలిక బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం  వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో కృష్ణా, గోదావరిలలో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకొని కోటీ 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తొలి నాలుగేళ్లలోనే ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని, 90 శాతం ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేసీఆర్ తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు అనుమతులను కూడా సంపాదించగలిగామని చెప్పారు. ఇక ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని ఈ వర్షాకాలంలోనే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 20 వేలకుపైగా చెరువుల పునరుద్ధరణ జరిగినట్లు చెప్పారు. కాలువల పునరుద్ధరణ ద్వారా చెరువులకు పునర్వైభవం తేనున్నట్లు స్పష్టం చేశారు. ఈ యేడాది రెవెన్యూ వ్యయం రూ.లక్షా 31,629 కోట్లు, ఆర్థికలోటు- రూ.27,749 కోట్లు, రెవెన్యూ మిగులు- రూ.6,564 కోట్లు, ప్రగతి పద్దు- రూ.లక్షా 7,302 కోట్లు, నిర్వహణ పద్దు- రూ.74,715 కోట్లు వుంది.