అమర జవాన్లకు అండగా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమర జవాన్లకు అండగా

హైదరాబాద్, ఫిబ్రవరి 21,  (way2newstv.com)
 అమరులైన ఒక్కో జవాన్ కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.  దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట మన జవాన్ల మీద దాడి జరుగుతూనే ఉంది. ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇవ్వాలని అయన అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టాడానికి ముందు పుల్వామా ఘటనపై సభ్యులు మాట్లాడారు.  

 
అమర జవాన్లకు అండగా 

ఎంఐఎం సభ్యుడు బలాల మాట్లాడుతూ  పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సమయంలోనే మనమంతా ఐక్యతను ప్రదర్శించాలి. దిగ్భ్రాంతికర సంఘటనను సహించాల్సిన అవసరంలేదు. దేశంలోకి శక్తివంతమైన పేలుడు పదార్థాలు ఎలా వస్తున్నాయో నిఘా పెట్టాలి. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్లో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించిందని అన్నారు.