దేవాదుల ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 4, (way2newstv.com)
దేవాదుల ప్రాజెక్టు మూడో దశ మూడో ప్యాకేజీలో భాగంగా హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామంలో ఆడిట్‌ 10 వద్ద పనులను రైతులు అడ్డుకున్నారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ మూడో ప్యాకేజీలో భాగంగా హసన్‌పర్తి మండలం పెగడపల్లి గ్రామంలో టన్నెల్‌ నిర్మాణానికిగాను 37.400 కిలోమీటర్ల వద్ద ఆడిట్‌ 10 పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ పనులను కోస్టల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ చేపట్టింది. ఆ కంపెనీ అర్ధాంతరంగా ఈ పనుల నుంచి తప్పుకుంది. ఈ కంపెనీ పనులు చేసేటప్పుడే ఆర్నెళ్ల నెలల క్రితం పనులను నిలిపివేసింది. ఈ ఆడిట్‌ 10 పనులు జరిగే ప్రాంతంలో గతంలో అధికారులు 29.20 ఎకరాలు సేకరించింది. ఈ భూములకు ఎకరాకు రూ.17.50 లక్షల నష్టపరిహారం ఇవ్వడానికి అధికారులు అంగీకరించారు. అంతేకాదు పనులు జరుగుతున్న కాలంలో ఏటా పంట నష్టంగా ఎకరాకు రూ.60 వేలు ఇవ్వడానికి అంగీకరించారు.


దేవాదుల ప్రాజెక్టు పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు

 పనులు ముగిశాక రైతుల భూమి రైతులకు అప్పగించనున్నట్లు ఒప్పందంలో కాంట్రాక్టరు ఒప్పుకున్నారు. అయితే ఈ పంట నష్టపరిహారం చెల్లించకుండానే సదరు కంపెనీ పనులు చేస్తుండడంతో రైతులు అడ్డుకున్నారు. దీని పర్యవసానంగా ఆర్నెళ్లుగాపనులు నిలిచిపోయాయి. ఇక్కడ ఈ 10వ నెంబర్‌ ఆడిట్‌లో 1300 మీటర్ల లోతు వరకు రాయిని తొలవాల్సింది ఉండగా 1200 మీటర్ల లోతు వరకు తొలిచారు.మెగా ఇంజనీరింగ్‌ ఇన్‌ ఫాస్ట్రక్చర్‌ కంపెనీతో పెగడపల్లి భూ నిర్వా సితులకు జరిగిన ఒప్పందంలో పనులు పూర్త య్యాక తిరిగి భూమిని రైతులకు అప్పగించ నున్నట్లు సదరు కంపెనీ అంగీ కరించింది. ఇందులో భాగంగా ఎకరాకు రూ.17.50 లక్షల నష్టపరిహారంతో పాటు పనులు జరిగినంత కాలం ఎకరా పంట పరిహారం కింద రూ.60 వేలు చొప్పున ఏటా ఇవ్వడానికి అంగీకరించారు. రెండేళ్లుగా మెగా కంపెనీ నుంచి రైతులకు పంట నష్టం చెల్లించలేదు. దీంతో పనులు చేయొద్దంటూ రైతులు అడ్డుకున్నారు. ఆర్నెళ్లుగా పనులు జరగడం లేదు. పంట నష్టంతోపాటు భూమికి సంబంధించిన పరిహారం కూడా చెల్లించక పోవడంతో రైతులు తీవ్ర వేదనకు గురౌతున్నారు. పెగడపల్లి గ్రామానికి చెందిన 29.20 ఎకరాల భూమిని పనుల కోసం సేకరించారు. నష్ట పరిహారం ఇవ్వకుండానే కోస్టల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ప్రతినిధులు పనులు చేస్తుండడంతో రైతులు అడ్డుకున్నారు. తాజాగా ఈ పనులు కోస్టల్‌ కంపెనీ నుండి మెగా కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి బదిలీ అయ్యాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం ఆడిట్‌ 10లో పనులు చేయడానికి వచ్చిన మెగా కంపెనీ అధికారులను రైతులు అడ్డుకున్నారు. కౌలు డబ్బులు ఇస్తామని చెప్పినా రైతులు నిరాకరించారు. పరిహారం డబ్బులు ఇచ్చాకే పనులు చేయాలనడంతో పనులు నిలిపివేశారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశలో భాగంగా టన్నెల నిర్మాణానికి సంబంధించిన పనులను చేపట్టిన కోస్టల్‌ కన్‌స్ట్ర
Previous Post Next Post