హైద్రాబాద్, ఫిబ్రవరి 2, (way2newstv.com)
బిసి గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం 3689 పోస్టులు మంజూరు చేసింది. వీ టికి తోడు జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల సొసైటీ కార్యాలయానికి 28 పోస్టు లు, అవుట్‌సోర్సింగ్‌లో మరో 10 పోస్టు లు, గురుకులాల్లో 595 అవుట్‌సోర్సింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిం ది. రాష్ట్రంలో ప్రభుత్వం 119 కొత్త బిసి సంక్షేమ గురుకులాలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ గురుకులాలన్నీ మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఆధ్వర్యంలో పనిచేస్తాయి. కొత్త గురుకులాల అవసరాలన్నీ తీరేలా పోస్టులు మం జూరు చేశారు. మంజూరైన పోస్టులన్నీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే వర్తిస్తాయని, ఇందుకు అనుగుణంగా బిసి సం క్షేమ శాఖ చర్యలు తీసుకోవాలని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది.
కొత్త జోనల్ ప్రకారం పోస్టుల మంజూరు
ఇప్పటికే తమ వద్ద ఉన్న ప్రతిపాదనలను ప్రభుత్వ శాఖలకు తిప్పి పంపించి, కొత్త జోనల్ పద్ధతి ప్రకారం త2000 ఖాళీల భర్తీకి రంగం సిద్ధంపోస్టుల విభజన చేయాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పలు ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 2000 వరకు ఉన్న పోస్టులు భర్తీచేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు గతంలోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు చేరాయి. ఇటీవలే కొత్త జోనల్ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కమిషన్ ప్రతిపాదనలు తిప్పిపంపించింది. నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోవడంతో కమిషన్‌కు సులువైంది. గ్రూప్ 1లో 137 పోస్టులు, గ్రూపు 3లో 339 పోస్టులతో పాటు ప్రజారోగ్యం, పురపాలక శాఖ, రోడ్లు, భవనాలశాఖ, భూగర్భ జలవనరుల శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐపిఎం, దేవాదాయ శాఖ, అటవీ, పర్యావరణ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ శాఖలు, పశు సంవర్థక శాఖ, జిహెచ్‌ఎంసి, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ, మత్యశాఖ, ఆర్‌టిసి, హోంశాఖ, కార్మిక శాఖ తదితర శాఖలకు చెందిన పోస్టులు త్వరలోనే భర్తీచేయనున్నారని సమాచారం. సుమారుగా 2000 వరకు ఉన్న ఈ పోస్టులను ప్రభుత్వ శాఖల నుంచి కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా విభజించి టిఎస్‌పిఎస్‌సికి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఇప్పుడు మధ్యలో ఉంది. కమిషన్ తరపున పంపిన లేఖలకు కొన్ని శాఖలే సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. మిగతా శాఖల నుంచి సమాచారం పూర్తిగా రాగానే వెంటనే అన్ని పోస్టులను నోటిఫై చేస్తుంది. ఆ తదుపరి వారం, పది రోజుల్లోనే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతుందని కమిషన్ ఉన్నతస్థాయి వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Tags:
telangananews
