ఖమ్మం, ఫిబ్రవరి 2, (way2newstv.com)
సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అటవీ అనుమతులు మంజూర య్యాయి. దీంతో 1531 హెక్టార్ల అటవీ భూమి ని ప్రాజెక్టు అవసరాల నిమిత్తం వినియోగించుకునేందుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. మొదటి దశ అటవీ అనుమతులు లభించిన సరి గ్గా ఏడాదికి రెండో దశ అనుమతులు వచ్చాయి సీతారామ ప్రాజెక్టుకు తుది అటవీ అనుమతులు రావడంతో మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, ఖ మ్మం డివిజన్లలోని అటవీ భూములను వినియోగించుకోడానికి మార్గం సుగమమైంది.మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలని ప్రభుత్వం లక్షంగా విధించుకోగా, కీలక అనుమతులు లభించడంతో నిర్మాణం గాడిలో పడనుంది. గోదావరి నది నుంచి దుమ్ముగూడెం ఆనకట్ట బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తీసుకునే ఈ ప్రాజెక్టు ద్వారా మూడు టిఎంసిల మేర నీటిని త్రాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంది. నాలుగు పంపు హౌజ్‌లు, తొమ్మిది కి.మీ. మేర పైప్‌లైన్ కొన్ని చోట్ల టన్నెల్‌ల నిర్మాణం జరుగుతుంది. ఈ అనుమతులు మంజూరు కావడంతో పాములపాడు దగ్గర లిఫ్టు పంపులను ఏర్పాటు చేసుకోడానికి, తీసుకోడానికి మండలంలోని రోళ్ళపాడు దగ్గర రిజర్వాయర్‌ను నిర్మించుకోడానికి వీలు కలిగింది. ఈ ప్రాజెక్టుతో కూసుమంచి, ఇల్లెందు, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో సాగునీటితో పాటు త్రాగునీటి అవసరాలు తీరుతాయి.భూ ముల్లో ప్రాజెక్టుకు అవసరమైన కెనాళ్లు, టన్నెళ్లు, విద్యుత్ లైన్ల నిర్మాణపు పనులు చేసుకోడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా సౌకర్యం ఏర్పడింది.
ఇక సీతారామ ప్రాజెక్టు పరుగులు
కొత్త ఏడాదిలో సీతారామకు వరుసగా అనుమతులు వస్తున్నాయి. జనవరి 7వ తేదీన పర్యావరణ అనుమతి లభించగా, 30వ తేదీన అటవీ తుది అనుమతి లభించడం విశేషం. ఇక స్థానిక కలెక్టర్లు, డిఎఫ్‌ఓ, ఇరిగేషన్ అధికారులు సమన్వయం చేసుకొని అటవీ భూములు స్వాధీ నం చేసుకోవడమే మిగిలింది. అటవీ శాఖ మొద టి దశ అనుమతుల సమయంలో కేంద్ర ప్రభు త్వం సూచించిన నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభు త్వం రూ.270 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. అడవులు పెంచడానికి ప్రత్యామ్నాయ భూములు కూడా చూపింది. ఇక అడవి పెంచే పనిని కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖల బాధ్యత.అటవీ, పర్యావరణ అనుమతులపై ముఖ్యమం త్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దీనిపై ఇప్పటికే పలు మార్లు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తో ప్రత్యేక చర్చించారు. ఈ చర్చల ఫలితంగానే అనుమతుల ప్రక్రియలో వేగం పెరిగింది. రాష్ట్ర అభివృద్ధిలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను వివరించడంతో పాటు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతులు సత్వరం మంజూరు కావాల్సిన అవసరాన్ని హర్షవర్థన్‌కు సిఎం వివరించారు. సాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక, త్రాగునీటి అవసరాలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు 2.72 లక్షల హెక్టార్ల (6.74 లక్షల ఎకరాలు)కు గోదావరి నది నుంచి సాగునీరు అందుతుంది. ఇందులో 1.33 లక్షల హెక్టార్లు (3.29 లక్షల ఎకరాలు) కొత్త ఆయకట్టే కావడం విశేషం. మరో 1.39 లక్షల హెక్టార్ల (3.45 లక్షల ఎకరాలు) మేర భూమి స్థిరీకరణలోకి వస్తుంది. మొత్తంగా సీతారామ ప్రాజెక్టు కారణంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని సాగు, తాగు నీటి అవసరాలు తీరతాయి. కొత్త ఆయకట్టును సృష్టించడమే కాకుండా పలు సంప్రదాయ చెరువులకు నీటిని సరఫరా, గ్రామాల్లో ఇప్పటికే సాగులో ఉన్న కొన్ని పథకాల నిర్వహణకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. సుమారు రూ. 13,384 కోట్లు అంచనాతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టుకు 8,476 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 1531 హెక్టార్ల (3781 ఎకరాల) అటవీ భూమి కాగా, మిగిలిన భూమిని ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ శాఖల నుంచి సమకూర్చుకోవాలి. దాదాపు 157 గ్రామాల్లోని 9696 కుటుంబాలు ముంపు ప్రభావానికి గురవుతాయి.
Tags:
telangananews