ఆరు నెలలు ప్రజల్లోనే టీడీపీ నేతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆరు నెలలు ప్రజల్లోనే టీడీపీ నేతలు

అమరావతి, ఫిబ్రవరి 23, (way2newstv.com)
రాబోయే 6 నెలల పాటు వరుస ఎన్నికలు ఉంటాయనీ, టీడీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. శనివారం ఉదయం అయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ వచ్చాకే తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందని  అయన అన్నారు. రాయలసీమ ప్రాంతానికి సాగునీటిని తీసుకురావడంతో టీడీపీపై సానుకూలత పెరిగిందని అభిప్రాయపడ్డారు. రైతుల్లో పూర్తి సానుకూలతే టీడీపీకి శుభపరిణామమని అన్నారు. సంక్షేమం పట్ల పేదల్లో పూర్తి సంతృప్తి టీడీపీకి వరమన్నారు. ఈ ఐదేళ్లలో మనం అన్ని పనులు బాగా చేశామని తెలిపారు.  


 ఆరు నెలలు ప్రజల్లోనే టీడీపీ నేతలు

ఏపీకి ప్రత్యేకహోదాపై రాహుల్ స్పష్టత ఇచ్చారనీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ మాయమాటలు చెప్తానంటే కుదరదని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాకే మోదీ ఇక్కడ కాలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే తెలుగువాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని అన్నారు. వైకాపా కు ఒక్క ఓటు వేసినా టీఆర్ఎస్, బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
రాష్ట్ర  భవిష్యత్ కోసం చిరకాల ప్రత్యర్థులు సైతం విభేదాలను పక్కన పెట్టి టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు తెలిపారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి, కోట్ల, కేఈ కుటుంబాలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఆనాడు ఢిల్లీ కుట్రలు ఎలా తిప్పికొట్టారో… మహానాయకుడు సినిమాలో చూపారని, ఇప్పుడూ అదే చేయాలని నేతలకు సూచించారు.  వ్యవసాయానికి చేసిన మేళ్లు రైతులకు వివరించాలని సూచించారు. ఉపాధి కల్పనకు ఏం చేశామో నిరుద్యోగులకు చెప్పాలన్నారు. పరిశ్రమలు ఎన్నితెచ్చామో యువతకు చెప్పాలని  చంద్రబాబు తెలియజేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చాకే  తెలుగు వాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందని చంద్రబాబు అన్నారు.