నిరంజన్ కు కలిసొచ్చిన సెంటిమెంట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిరంజన్ కు కలిసొచ్చిన సెంటిమెంట్

హైదరాబాద్, ఫిబ్రవరి 19  (way2newstv.com
టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు వచ్చినా మూడనమ్మకాలు, జాతకాల విషయంలో మాత్రం మార్పులు రావడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. సీఎం కేసీఆర్ కు ఈ నమ్మకం ఎక్కువ. ఆయన ఏ పని చేసినా పండితులను సంప్రదించిన తర్వాతనే చేస్తారు. మంగళవారం రోజు మంచిది కాదని చాలా మంది ఏ పనులు చేయరు. కానీ సీఎం కేసీఆర్ ఎక్కువగా నూతన పనులు చేసింది మంగళవారమే. ఆయనకు అన్ని కూడా కలిసొచ్చాయి.
గతంలో నూతన కలెక్టరేట్ల ప్రారంభం కూడా మంగళవారమే చేశారు. పలు ప్రారంభోత్సవాలు కూడా మంగళవారమే చేశారు. తాజాగా మంత్రి వర్గ విస్తరణ కూడా మంగళవారమే చేశారు. 


నిరంజన్ కు కలిసొచ్చిన సెంటిమెంట్

ఆయన లాగే జ్యోతిష్యాన్ని నమ్ముకున్న ఓ నేత ఏకంగా మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా మంత్రి పదవిని సైతం అలంకరించారు. ఆయనే తెలంగాణ మంత్రి, వనపర్తి ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేశారు. కేసీఆర్ సన్నిహితుల్లో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా నిరంజన్ రెడ్డి గులాబీ రంగు కండువాకు బదులుగా పసుపు రంగు కండువాతో వచ్చారు. దీనిపై అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయినా కూడా ఆయన పసుపు కండువాతోనే నామినేషన్ వేసి ప్రచారం చేశారు. 
అయితే శుభానికి చిహ్నమైన పసుపు రంగు కండువా వేసుకుంటే ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు మంత్రిపదవి సైతం వరిస్తుందని ఓ పండితుడు ఆయనకు చెప్పారట. దీంతో పసుపురంగు కండువాతోనే నిరంజన్ రెడ్డి నామినేషన్ వేశారు. అనుకున్నట్లుగానే సెంటిమెంట్ కలిసొచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రిపదవిని సైతం దక్కించుకున్నారు. దీంతో అదృష్టమంటే తమ నేతదేనని నిరంజన్ రెడ్డి అనుచరులు తెగ సంతోషపడిపోతున్నారు. చూశారుగా సెంటిమెంట్ ఈ మంత్రిగారి విషయంలో ఎంత బలంగా పనిచేసిందో అని అంతా చర్చించుకుంటున్నారు.