అద్దెభవనాల్లోనే అంగన్ వాడీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అద్దెభవనాల్లోనే అంగన్ వాడీలు

కడప, ఫిబ్రవరి 14, (wat2newstv.com)
కడప జిల్లాలో 15 అంగన్వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి కింద గల 3621 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 3208 మంది వర్కర్లు, ఆయాలు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2893 మంది అంగన్వాడీ వర్కర్లు, 315 మినీ అంగన్వాడీ కేంద్రాల్లోని వర్కర్లు, ఆయాలను కలిపి లెక్కిస్తే 3208 మంది వరకు ఉన్నారు. జిల్లాలో 2732 అంగన్వాడీ భవనాలు అద్దెభవనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఓ అంచనా. వీటికి రూరల్‌ పరిధిలో రూ.200, అర్బన్‌లో రూ.6000 అద్దె చెల్లించాల్సి ఉంది.


అద్దెభవనాల్లోనే అంగన్ వాడీలు
 
కానీ వీటికి ఎనిమిది నెలల నుంచి అద్దెల చెల్లింపులు చేయడం లేదు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో 18 నెలలుగా అద్దెలు చెల్లించడం లేదని తెలుస్తోంది. అర్బన్‌ ప్రాంతాల్లో వందల సంఖ్యలో పిల్లలు ఉన్న నేపథ్యంలో కొన్ని పట్టణాల్లో అద్దెకు రూ.8000పైగా చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ.ఆరు వేలు మాత్రమే అద్దెకు విడుదల చేస్తోంది. దీంతో రూ.రెండు వేలు అదనంగా అంగన్వాడీ వర్కర్లు చెల్లించాల్సి వస్తోంది. ప్రతి నెలా రెండు సార్లు ప్రాజెక్టు సమావేశాలకు హాజరు కావాల్సి ఉంది. ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి తప్పని సరిగా హాజరుకు కావాల్సి ఉంది. ప్రాజెక్టు సమావేశాలకు, ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్య క్రమాల హాజరుకు సంబంధించి టిఎ, డిఎలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా టిఎ, డిఎల చెల్లింపుల్లో నిర్లక్ష్యం మేటమేసిన నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు చెందిన వర్కర్లు, ఆయాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహణకు నడుంభిగించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగ న్వాడీ సేవలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల నిర్వహ ణలో పాలుపంచుకుంటున్న అంగన్వాడీల బకాయి చెల్లింపుల సమస్యలను సత్వరమే పరిష్కరించాల్సి ఉందనడంలో సందేహం లేదు.