నటి ఝాన్సీ ఆత్మహత్య - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నటి ఝాన్సీ ఆత్మహత్య

హైదరాబాద్, ఫిబ్రవరి 6, (way2newstv.com)
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య  చేసుకుంది.   శ్రీనగర్ కాలనీలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఝాన్సీ అంతకుముదు సూర్య అనే వ్యక్తి తో వాట్స్ ఆప్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కృష్ణ జిల్లా ముద్దెనెపల్లి మండలం వాడాలి గ్రామానికి చెందిన ఝాన్సీ మాటీవీలో వచ్చిన  పవిత్రబంధం సీరియల్ లో ఒక పాత్ర  పోషించింది. అయితే సూర్య తో పరిచయం అనంతరం ఆమె సీరియల్స్ కు దూరంగా ఉంటుంది. 


నటి ఝాన్సీ ఆత్మహత్య
 
సూర్యతో లవ్ లో పడ్డ ఝాన్సీ, అతనికి డబ్బు సాయం చేసినట్టు, ది. పెళ్లి వరకూ వచ్చేసరికి అతను మొహం చాటేయడం, డబ్బు అడిగితే, ఇవ్వబోనని చెప్పడంతోనే మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం. ఘటన విషయం తెలియగానే పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె తన కుటుంబ సభ్యులతోనూ మాట్లాడినట్టు పోలీసులు నిర్దారించారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాఫ్తు చేస్తున్నామని,  అపార్ట్ మెంట్స్ వాచ్ మెన్ ను ప్రశ్నిస్తున్నామని పోలీసులు అన్నారు.