సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి

హైద్రాబాద్, మార్చి 9, (way2newstv.com)
బాహుబలి’కి నచ్చే ‘దేవసేన’ ఎక్కడుందో కాని.. ప్రభాస్ మాత్రం ఫైటింగ్‌లే తప్ప పప్పన్నం ఇప్పట్లో పెట్టేలా కనిపించడం లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేరే ఈ మిస్టర్ పర్ఫెక్ట్‌కి బాగా సూట్ అయ్యిందని.. పెళ్లి చేసుకుని ఆ పేరుని చెరిపేసుకోవడం ఇష్టం లేకనో ఏమో కాని.. తన తోటి స్టార్ హీరోలు.. అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, పెళ్లి చేసుకుని భార్యలతో కలిసి ఎంచక్కా ఫారిన్ ట్రిప్పులేస్తుంటే మనోడు మాత్రం ఇంకా ‘డార్లింగ్’ అని పిలిపించుకోవడంతోనే సరిపెట్టేస్తున్నాడు. సరే ఆయన పెళ్లి ఆయన ఇష్టం.. మనకు ఎందుకులే కాని.. ఆయన ఫ్యాన్స్‌తో పాటు ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ పప్పన్నం పెడతాడని బాహుబలి రిలీజ్ అప్పటి నుండి వెయిట్ చేస్తున్నారు. తీరా బాహుబలి వచ్చింది బొమ్మ హిట్ అయ్యింది.. ప్రభాస్‌కి నచ్చిన బొమ్మాలి మాత్రం ఇంకా సెర్చింగ్‌లోనే ఉండటంతో ప్రభాస్ పెద్దమ్మ (క్రిష్ణంరాజు భార్య శ్యామలా దేవి) ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. 


సాహో తర్వాత ప్రభాస్ పెళ్లి

‘మీలాగే మేం కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూస్తున్నాం.. చాలా కాలంగా మావాడిని ఓ ఇంటి వాడిని చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాం. ఈలోపు బోలెడు పుకార్లు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ప్రభాస్‌తో చర్చిస్తే.. కాసేపు సరదాగా నవ్వుకున్నాం. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’, రాధాక్రిష్ణలతో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ సినిమాలు పూర్తైతే ఇక పెళ్లి గురించే ఆలోచిస్తా అన్నాడు. సో.. ఈ రెండు సినిమాలు తొందరగా పూర్తవ్వాలని ఎదురుచూస్తున్నాం. ఎందుకంటే ప్రభాస్ పెళ్లి ఆ రెండు సినిమాల విడుదల తరువాతే కాబట్టి.. అప్పుడు చెబుతాం మా వాడి పెళ్లి పెళ్లి కబురు’.. అంటూ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి క్లారిటీ ఇచ్చారు. కాగా ‘బాహుబలి 2’ చిత్రం తరువాత ప్రభాస్ పెళ్లి పీటలు ఎక్కడం గ్యారంటీ.. ఈ ఏడాదిలోనే పెళ్లి ఉంటుందంటూ 2017 జనవరిలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి కబురు చెప్పారు. కాని ‘బాహుబలి 2’ 2017 ఏప్రిల్ 28 విడుదలై రెండేళ్లు కావొస్తోంది. ఇప్పటి వరకూ ప్రభాస్ పెళ్లి ఊసే లేకపోగా.. ‘సాహో’ విడుదలకు వాయిదా పడింది. ఇప్పుడు సాహో తరువాత మూవీకి షిఫ్ట్ కావడంతో ప్రభాస్ పెళ్లి వార్తలు ఇంకో మూడేళ్లుపాటు కొదువే ఉండదన్నమాట.