బెంగళూరు మార్చ్ 21(way2newstv.com)
ప్రముఖ సినీ నటి సుమలత అంబరీష్ మాండ్య లోక్ సభ స్థానానికి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. సుమలత తన మద్దతుదారులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. సుమలత మాండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
అంబరీష్ మాండ్య లోక్ సభ స్థానానికి సుమలత నామినేషన్
నామినేషన్ వేసే ముందు ఛాముండేశ్వరీ ఆలయాన్ని సుమలత సందర్శించారు. తన కుమారుడితో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి కుమారుడు నటుడు నిఖిల్ కుమారస్వామి జేడీ(ఎస్) తరపున మాండ్యా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.