అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభకు ఎక్కడి నుంచైనా పోటీ: రేవంత్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభకు ఎక్కడి నుంచైనా పోటీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ మార్చ్ 13 (way2newstv.com)  
అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా అధిష్ఠానం ఆదేశించినట్లు నడుచుకోక తప్పదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో.. ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతలకు ఉందని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.


అధిష్ఠానం ఆదేశిస్తే లోక్‌సభకు ఎక్కడి నుంచైనా పోటీ: రేవంత్ రెడ్డి

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్‌లో ఉన్నాయని అభిప్రాయపడ్డారు. పోరాడే సమయంలో నాయకుడు పోరాడాల్సిందేనని, ఇది తన బాధ్యత అనుకుంటున్నానని తెలిపారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన భాజపా... మూడు మాసాల తర్వాత వచ్చిన శాసనసభ ఎన్నికల్లో దిల్ల్లీలో ఎందుకు ఓడిపోయిందని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే... కాంగ్రెస్ తెందూల్కర్‌ లాంటిదని వ్యాఖ్యానించారు. సంప్రదాయాల పేరిట తెరాస... కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందని, మరి కాంగ్రెస్‌కు నంబర్ ఉన్నా... కేసీఆర్ ఎలా అభ్యర్థిని పెట్టారని ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి సూటిగా ప్రశ్నించారు.