జిల్లాలో టీడీపీకి పునాదులు లేకుండా చేస్తా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లాలో టీడీపీకి పునాదులు లేకుండా చేస్తా...

మైదకూరులో పుట్టా ఎలా గెలుస్తాడో చూస్తా: డీఎల్
కడప మార్చ్ 5 (way2newstv.com
మైదకూరు అసెంబ్లీ సీటు విషయంలో బాబు చేసిన మోసంపై మాజీ మంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత డీఎల్ రవీంద్ర రెడ్డి నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో మైదకూరు అసెంబ్లీ సీటు ఇస్తానని హామీ ఇచ్చి .. ముఖ్యమంత్రి చంద్రబాబు చివరకు మోసం చేసి మొండిచేయి చూపారని ధ్వజమెత్తారు. కనీసం ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. 


జిల్లాలో టీడీపీకి పునాదులు లేకుండా చేస్తా...

జిల్లాలో టీడీపీకి పునాదులు లేకుండా చేస్తానని.. తనకు ఇతర రాజకీయ పార్టీలు సహకరిస్తే జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీని ఓడిస్తానని డీఎల్ ధీమా వ్యక్తం చేశారు.తమకు మంచిరోజులొస్తాయని.. అధైర్యపడవద్దని కార్యకర్తలకు సూచించారు. డీఎల్ తాజాగా ఆయన స్వస్థలమైన ఖాజీపేటలో అనుచరులతో సమావేశమై చంద్రబాబు చేసిన మోసంపై వారితో చర్చించారు. తెలుగుదేశం పార్టీ తనకు చివరి నిమిషంలో మోసం చేసిందని డీఎల్ వాపోయారు.  చంద్రబాబు వాడుకొని తనను వదిలేశాడని డీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీలో చేరాలని స్వయంగా బాబు ఆహ్వానించారని..తాను అమరావతి వెళ్లి బాబును కలిసి మైదకూరు టికెట్ అడిగితే ఇస్తాననడంతో టీడీపీలో చేరుతానన్నాను. కానీ తనకు తెలియకుండానే మైదకూరు అసెంబ్లీ సీటును పుట్టా సుధాకర్ యాదవ్ కు కట్టబెట్టాడని డీఎల్ ఫైర్ అయ్యారు.కనీసం టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించినా.. ఆయన గడప తొక్కొద్దని హెచ్చరించారని డీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టా మైదకూరులో ఎలా గెలుస్తాడో చూస్తానని డీఎల్ సవాల్ విసిరారు.తన సీటుకోసం.. బీఫారం కోసం టీడీపీ - వైసీపీ - జనసేన నేతలను అడుక్కోవడం సిగ్గుగా ఉందని.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరికో బీఫారాలను ఇప్పించానని డీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు.