ప్రయాణికుల సౌకర్యార్ధం కామన్ మొబిలిటీ కార్డు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రయాణికుల సౌకర్యార్ధం కామన్ మొబిలిటీ కార్డు

హైదరాబాద్ మార్చ్ 27 (way2newstv.com
రాష్ట్రంలో మెట్రోరైల్, రోడ్డు రవాణా సంస్ధ బస్సులు, ఎంఎంటిఎస్, ఆటోలు, క్యాబ్ ల ద్వారా రవాణా చేసే ప్రయాణికుల సౌకర్యార్ధం కామన్ మొబిలిటీ కార్డు అందించటానికి అవసరమైన  ఏజెన్సీని ఎంపిక చేసే నిమిత్తం ఆర్ఎఫ్ సి ని జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషి ఆదేశించారు.బుధవారం సచివాలయంలో  ప్రయాణికులకు కామన్ మొబిలిటీ కార్డు అందించే విషయంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, రోడ్డు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, మెట్రోరైల్ యం.డి. ఎన్.వి.ఎస్ రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే సి.జి.యం కె.వి రావు, ఆర్టిసి ఇడి పురుషోత్తం నాయక్ లతో పాటు ఓలా, ఊబర్, ఆటో యూనియన్ లు, సర్వీస్ ప్రోవైడర్లు, బ్యాంక్, ఎల్అండ్టి ప్రతినిధులు పాల్గొన్నారు.


 ప్రయాణికుల సౌకర్యార్ధం కామన్ మొబిలిటీ కార్డు 

ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ ప్రయాణికులకు అందించే కామన్ మొబిలిటీ కార్డు ద్వారా రైల్వే, మెట్రోరైల్, క్యాబ్ లు, ఆటోలు, ఆర్.టి.సి ప్రయాణికుల  అవసరాలు తీరాలని అన్నారు. మొబిలిటీ కార్డు వేరే అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగడంతో పాటు, వివిధ రవాణా  మార్గాల పద్దతుల ద్వారా ప్రయాణించే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా చూడాలన్నారు.క్యుఆర్కోడ్ స్వైపింగ్ తదితర సిస్టమ్స్ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం  సిఫారసు చేసిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, ఎన్పిసిఐ స్పెషిఫికేషన్లపైనా చర్చించారు. ఒకే కార్డుద్వారా ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు అందేలా చూడాలన్నారు. ఆర్.టి.సి ఎంఎంటిఎ, ఆటోలు, క్యాబ్ ల ద్వారా రోజు వారి ప్రయాణించే ప్రయాణికుల వివరాలు సమర్పించాలన్నారు.  శాఖలు తమ అవసరాలను తెలుపాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న పద్ధతులు, భవిష్యత్తు టెక్నాలజీని దృష్టిలో ఉంచుకోని కార్డుని రూపొందించే బాధ్యతలు అప్పగించాలన్నారు.