ముంబై, ఏప్రిల్ 2, (way2newstv.com)
అదేంటి ఒక్క రూపాయికే రూ.20,000 స్మార్ట్‌ఫోన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును ఇది నిజమే. ఒక్క రూపాయికే రూ.20,000 ఫోన్‌ను కొనొచ్చు. అయితే దీనికి అదృష్టం ఉండాలి. రూ.1కే రూ.20,000 స్మార్ట్‌ఫోన్ ఎలా పొందాలో చూద్దాం.. చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ షావోమి ఇప్పటికే ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది ఏప్రిల్ 4 నుంచి ప్రారంభమౌతుంది.
రూపాయికే 20 వేల ఫోన్
6వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ రూ.1 ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 4న రూ.1 ఫ్లాష్ సేల్‌లో భాగంగా రెడ్‌మి నోట్ 7 ప్రో, ఎంఐ సౌండ్‌బార్‌ను రూ.1కే కొనొచ్చు. ఇక ఏప్రిల్ 5న ఎంఐ హోమ్ కెమెకా (బేసిక్), పోకో ఎఫ్1 (6 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ) రూ.1 సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ.19,999. కేవలం 20 యూనిట్ల ప్రొడక్టులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 6న 30 యూనిట్ల ఎంఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, 10 యూనిట్ల ఎంఐ 32 అంగుళాల టీవీలు రూ.1కే అందుబాటులో ఉండనున్నాయి. ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతుంది